‘పుష్ప 2’ లో నేను లేను..!

Manoj Bajpayee Gives Clarity About Pushpa Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Pushpa,Pushpa Movie,Pushpa Telugu Movie,Manoj Bajpayee Gives Clarity on Pushpa Movie,Manoj Bajpayee Gives Clarity About His Role in Pushpa Part2 Movie,Manoj Bajpayee Gives Clarity That he is Not in the Pushpa Movie, Manoj Bajpayee,Bollywood Star Actor Manoj Bajpayee,Bollywood Star Hero Manoj Bajpayee About Pushpa Movie,Allu Arjun Pushpa 2 Movie latest Updates,Pushpa Movie latest Updates, Allu Arjun,Icon Star Allu Arjun,Stylish Star Allu Arjun,Allu Arjun and Rashmika in Pushpa 2 Movie

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా పుష్ప. ఈసినిమా గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయి ఎన్ని సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. మొదటిసారి పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టిన బన్నీ మొదటి అడుగుతోనే నార్త్ లో తన సత్తా చూపించాడు. బన్నీ మాస్ యాక్షన్ కు నార్త్ అడియన్స్ కూడా ఫిదా అయిపోయారు. బన్నీ మానియా చాలా రోజులే నడిచింది. ఇప్పుడు కూడా ఏదో ఒక రికార్డ్ క్రియేట్ చేసుకుంటుంది. ఇక ఇప్పుడు అందరి దృష్టి పార్ట్ 2 పై ఉంది. మొదటి పార్ట్ సూపర్ సక్సెస్ అవ్వడంతో పార్ట్ 2 కోసం సాలిడ్ కథను సిద్దం చేస్తున్నాడు సుకుమార్. మరోవైపు ఫ్యాన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పటికే ఈసినిమాలో ఎంతో మంది స్టార్ కాస్టింగ్ ఉంది. అయితే తాజాగా రెండో పార్ట్ కోసం సుకుమార్ ఫ్యామిలీ మెన్ స్టార్ మ‌నోజ్ బాజ్‌పేయి లాంటి విలక్షణ నటుడిని తీసుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మనోజ్ పుష్ప గురించి ప్రస్తావిస్తూ ప్రశంసించారు. పర్ ఫెక్ట్ మేకింగ్ తో ఈసినిమాను తీశారనిఅన్నారు. దీంతో సెకండ్ పార్ట్ లో మనోజ్ ఉన్నాడంటూ.. ఓ పోలీసాఫీసర్ పాత్ర కోసం పుష్ప టీమ్ మనోజ్ బాజ్ పేయిని సంప్రదించినట్టు రెండు రోజులనుండి జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇక ఇప్పుడు ఈ వార్తలకు స్వయంగా తానే క్లారిటీ ఇచ్చేశాడు మనోజ్. తాను పుష్ప2 లో నటించడం లేదని.. అవన్నీ రూమర్స్ మాత్రమే.. ఇలాంటి వార్తలు ఎక్కడినుండి వస్తాయో అంటూ రూమర్స్ ను ఖండించారు. మరి ఇప్పటికే ఈ వార్తలకు బ్రేక్ పడుతుందేమో చూద్దాం.

కాగా ఈసినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా.. అనసూయ, సునీల్‌ కీలక పాత్రలు పోషించారు. మలయాళనటుడు ఫహద్‌ ఫాజిల్‌ ముఖ్య పాత్ర పోషించారు. రెండో పార్ట్ పుష్ప- ది రూల్‌ త్వరలో రాబోతుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.