పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ “లైగర్” ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ , మకరంద దేశ్ పాండే , రమ్యకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. తనీష్ బాగ్చి సంగీతం అందించగా , మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ మూవీ కై విజయ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నారు.”లైగర్” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు, వీడియోలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.“లైగర్” మూవీ పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కానుంది.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగు ట్రైలర్ ని మెగాస్టార్ చిరంజీవి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. హిందీ ట్రైలర్ ని రణ్ వీర్ సింగ్ మలయాళ ట్రైలర్ ని దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేశారు. విజయ్ దేవరకొండ రింగ్ లోకి ఎంటరవుతున్న విజువల్స్, రమ్యకృష్ణ పవర్ ఫుల్ డైలాగ్స్ తో రూపొందిన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. యాక్షన్ సన్నివేశాల్లోనే కాకుండా యాక్టింగ్ పరంగానూ విజయ్ తన నటవిశ్వరూపాన్ని ప్రదర్శించనున్నారు. “లైగర్” మూవీ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయనీ , టీం మొత్తానికి ఆల్ ది బెస్ట్ అంటూ మెగా స్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: