“లాల్ సింగ్ చద్దా”ప్రేయసి రూప ను పరిచయం చేసిన చిరంజీవి

Chiranjeevi Shares Kareena Kapoor look from Laal Singh Chaddha, Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022, Tollywood Movie Updates,Tollywood Latest News, Telugu Movie Updates, Chiranjeevi, Kareena Kapoor, Laal Singh Chaddha, Kareena Kapoor Khan as Laal Singh Chaddha, Laal Singh Chaddha Latest News, Laal Singh Chaddha Girlfriend Rupa, Aamir Khan, Laal Singh Chaddha Release Date, Laal Singh Chaddha Updates

వ‌యాకామ్ 18 స్టూడీయోస్‌, అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై అద్వైత్ చంద‌న్ ద‌ర్శ‌క‌త్వంలో అమీర్ ఖాన్ , కరీనా కపూర్ , నాగచైతన్య , మోనా సింగ్ ప్రధాన పాత్రలలో హాలీవుడ్ సినిమా “ఫారెస్ట్ గంప్‌” కు రీమేక్‌గా తెరకెక్కిన కామెడీ డ్రామా “లాల్ సింగ్ చద్దా” హిందీ మూవీ ఆగస్ట్ 11 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ తో టాలీవుడ్ హీరో నాగ చైత‌న్య బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ప్రీతమ్ సంగీతం అందించగా తనూజ్ టికు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“లాల్ సింగ్ చద్దా” హిందీ మూవీ ప్రివ్యూ షో మెగా స్టార్ చిరంజీవి ఇంటిలో ప్రదర్శించబడిన విషయం తెలిసిందే. “లాల్ సింగ్ చద్దా” మూవీ తెలుగు వెర్షన్ ను మెగాస్టార్ చిరంజీవి స‌మ‌ర్పిస్తున్నారు. తాజాగా చిరంజీవి హీరోయిన్ క‌రీనాక‌పూర్ పోషిస్తున్న రూప పాత్ర లుక్‌ను సోషల్ మీడియా ద్వారా విడుద‌ల చేశారు. లాల్ సింగ్ చద్దా ప్రేయసి ‘రూప’ని మీకు పరిచయం చేస్తున్నాననీ , వీళ్లిద్దరి బంధం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ‘ముద్దపప్పు-ఆవకాయ’..అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. చిరంజీవి ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + nine =