‘రంగమార్తాండ’ శివాత్మిక డబ్బింగ్ మొదలు

Shivathmika Starts Dubbing for Rangamarthanda,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Rangamarthanda,Rangamarthanda Movie,Rangamarthanda Telugu Movie,Rangamarthanda latest Updpates,Shivathmika in Rangamarthanda,Shivathmika Dubbing For Rangamarthanda Movie, Shivathmika Dubbing For Rangamarthanda Telugu Movie,Shivathmika Movie latest Updates,Actress Shivathmika,Shivathmika Movie Latest Updates,Shivathmika New movie Updates, Shivathmika Movie latest News,Shivathmika upcoming Movie Rangamarthanda

టాలీవుడ్ లో ఉన్న క్రియేటివ్ డైరెక్టర్లలో కృష్ణవంశీ పేరు ముందుంటుంది. తన సినీ కెరీర్ లో ఎన్నో డిఫరెంట్ కథలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ డైరెక్టర్ల కాంపిటీషన్ ఎక్కువవడం.. ప్రయోగాత్మక సినిమాలు తీయడం.. ప్రేక్షకుల దృష్టి కూడా మారడంతో ఆయన సరైన హిట్ అందుకొని చాలా కాలమైంది. ఇక ఇప్పుడు రీమేక్ సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. మరాఠిలో నానా పటేకర్ ప్రధాన పాత్రలో వచ్చిన నటసామ్రాట్ సినిమాకు ఇది రీమేక్. ఆ సినిమా అక్కడ మంచి విజయాన్ని దక్కించుకుంది. ఇక ఇప్పుడు కృష్ణవంశీ ఈసినిమాను తనదైన శైలిలో మేకింగ్ చేసి రిలీజ్ చేస్తున్నాడు. ఈసినిమాప్రమోషన్స్ ఇంకా జోరుగా మొదలవ్వకముందే అప్పుడే ఈసినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టింది. దీనిలో భాగంగా ఈసినిమాలో నటిస్తున్న వారు తమ పాత్రల డబ్బింగ్ లను మొదలుపెట్టారు. రీసెంట్ గానే అనసూయ తన డబ్బింగ్ ను పూర్తి చేసుకోగా ఇప్పుడు ఈసినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న శివాత్మిక కూడా తన డబ్బింగ్ ను మొదలుపెట్టింది.

కాగా ఈసినిమాలో ప్ర‌కాశ్ రాజ్‌, ర‌మ్య‌కృష్ణ‌, బ్ర‌హ్మానందం, రాహుల్ సిప్లిగంజ్ ఇత‌ర నటీన‌టులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అంతేకాదు ఈసినిమాకు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ అందిస్తున్న సంగతి తెలిసిందే కదా. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + eleven =