టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ మాత్రం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. సినిమా జయాపజయాలతో పనిలేకుండా వరుసపెట్టి సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఒక సినిమా తరువాత ఒక సినిమాను పూర్తి చేసూ రిలీజ్ చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన లిస్ట్ లో చాలా సినిమాలు ఉండగా అందులో కల్యాణ్‌జీ గోగణ దర్శకత్వంలో వస్తున్న తీస్ మార్ ఖాన్ కూడా ఒకటి. ఇక ఈసినిమాలో ఆది మూడు డిఫరెంట్ షెడ్స్ లో నటిస్తున్నాడన్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేశారు. ఇప్పటికే ఈసినిమా నుండి టైటిల్ మరియు ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ చేశారు. అంతేకాదు టీజర్ కూడా రిలీజ్ చేశారు. టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈసినిమా నుండి సెకండ్ టీజర్ ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Hi friends my next upcoming project
The interesting and entertaining #TeesMaarKhan teaser – 2 is out now🤩#AadiSaiKumar @starlingpayal @Mee_Sunil @shamna_kkasim @kalyankumarraja @ImSaiKartheek @adityamusic🎹🎹🎹🎼🎼🎼🎼 pic.twitter.com/5bKEbp6XMM— Sai Kartheek – Music Composer (@ImSaiKartheek) July 15, 2022
కాగా ఈసినిమాలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సునీల్, పూర్ణ, కబీర్ సింగ్, అనూప్ సింగ్ ఠాకూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజన్ సినిమాస్ బ్యానర్‌పై నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈసినిమాకు సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా.. బాల్‌రెడ్డి సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























