మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గానే ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న సినిమాలను ముగించే పనిలో బిజీగా ఉన్నారు. మెహన్ రాజా తో గాడ్ ఫాదర్ అలానే మెహర్ రమేష్ తో భోళా శంకర్ ఇంకా బాబి తో మరో సినిమా చేస్తున్నాడు. మూడు సినిమాకూడా సెట్స్ పైనే ఉన్నాయి. వీటిలో బాబి దర్శకత్వంలో వస్తున్న సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదన్న సంగతి తెలిసిందే కదా. మెగా 154 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా చిత్రీకరణ జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్నాడన్న వార్తలు గత కొద్దిరోజులుగా వస్తున్నసంగతి తెలిసిందే కదా. ఇన్ని రోజుల వార్తలతోనే సస్పెన్స్ లో ఉంచారు మేకర్స్. అయితే ఇప్పుడు ఈవార్తలపై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాలో రవితేజ నటిస్తున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మరి ఇప్పుడు రవితేజ ఉంటున్నాడన్న దానిపై క్లారిటీ వచ్చేసింది.. మరి ఏ రోల్ లో నటిస్తున్నాడో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాగా గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో అన్నయ్య సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఆ సినిమాలో చిరంజీవికి ఇద్దరి తమ్ముడులు ఉండగా అందులో ఒక తమ్ముడిగా రవితేజ నటించాడు.
The MASS FORCE joins The MEGA STORM 🔥
Team #Mega154 welcomes MASS MAHARAJA @RaviTeja_offl ❤️🔥
Experience #MegaMass in theatres from JAN 2023 💥
Megastar @KChiruTweets @shrutihaasan @dirbobby @ThisIsDSP @konavenkat99 @SonyMusicSouth pic.twitter.com/JDTjFuentZ
— Mythri Movie Makers (@MythriOfficial) July 16, 2022
కాగా ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈసినిమాను బాబి మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించబోతున్నాడు. ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























