చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వస్తున్న సినిమా కార్తికేయ 2. నిఖిల్ కెరీర్ ను ఒక మలుపు తిప్పిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా ఈసినిమా వస్తుంది. నిజానికి ఈసినిమా షూటింగ్ కే చాలా గ్యాప్ వచ్చింది. షూటింగ్ మొదలైన తరువాత కరోనా వల్ల కొన్ని నెలలు వాయిదా పడింది. ఫైనల్ గా ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసి జులై 22న రిలీజ్ చేద్దామని అనుకున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక ఈసినిమా రిలీజ్ అవుతుంది అనుకునే లోపు రిలీజ్ డేట్ ను వాయిదా వేశారు. ఈసందర్భంగా నిఖిల్ క్షమాపణలు చెబుతూ పోస్ట్ కూడా చేశాడు. జులై22న విడుదల కావాల్సిన ఈసినిమాను ఆగష్ట్ కు వాయిదా వేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరోవైపు ప్రమోషన్స్ లో స్పీడు మాత్రం పెంచుతుంది. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. ‘అడిగా నన్ను నేను అడిగా .. నాకెవ్వరూ నువ్వనీ, అడిగా నిన్ను నేను అడిగా నే నిన్నలా లేనని’ అంటూ వచ్చే వీడియో సాంగ్ రిలీజ్ అయింది. నిఖిల్ – అనుపమ ట్రావెల్ చేస్తుండగా ఈపాటను చిత్రీకరించారు. ఈపాటకు మంచి రెస్పాన్సే వస్తుంది.
Most loved Karthikeya & Mugdha Love Song #NannuNenuAdigaa is out now 😍❤ #Karthikeya2https://t.co/jfHwKKKsIZ@actor_Nikhil @anupamahere @AnupamPKher @Actorysr @harshachemudu @AdityaMenon22 @chandoomondeti @vishwaprasadtg @AbhishekOfficl @vivekkuchibotla @kaalabhairava7 pic.twitter.com/XPwXfGslC8
— People Media Factory (@peoplemediafcy) July 12, 2022
కాగా ఈసినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా శ్రీనివాస్ రెడ్డి బాలీవుడ్ దర్శకనిర్మాత అనుపమ్‌ఖేర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫి అందిస్తుండగా ..కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























