‘విజయ్’ టాటూతో లేడీ ఫ్యాన్ అభిమానం..!

Fan Girl Moment for Vijay Deverakonda Lady Fan,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Vijay Deverakonda,Hero Vijay Deverakonda,Vijay Deverakonda Latest Updates,Vijay Deverakonda Lady Fan Moment,Vijay Deverakonda Lady Fan With Tattoo,Vijay Deverakonda Movies, Vijay Deverakonda Upcoming Movies,Vijay Deverakonda New Movie Updates,Vijay Deverakonda Upcoming Movies,Vijay Deverakonda Next Projects,Vijay Deverakonda Liger Movie Updates, Vijay Deverakonda Liger,Vijay Deverakonda Kushi Movie Updates,Vijay Deverakonda with Samantha upcoming Movie Kushi,Vijay Deverakonda Fans,Vijay Deverakonda lady Fans,Vijay Deverakonda Lady Following

పెళ్లి చూపులు సినిమాతో మంచి హిట్ కొట్టి అందరినీ ఆకట్టుకున్నాడు విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు సినిమా తరువాత అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాడు. ముఖ్యంగా తన ఆటిట్యూడ్ తో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమాతో కేవలం తెలుగులోనే కాదు.. తమిళ్, హిందీ లో కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. హీరోయిన్స్ లో కూడా విజయ్ కు మంచి ఫాలోయింగ్ ఉందన్న సంగతి కూడా తెలిసిందే. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు విజయ్ తో సినిమా చేయాలని ఉందని పలు ఇంటర్వ్యూల్లో చెప్పిన సందర్భాలు చూశాం. అలాంటి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు విజయ్ దేవరకొండ.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఓ లేడీ ఫ్యాన్ ఈ రౌడీ హీరోపై తన అభిమానాన్ని చాటుకుంది. ఏకంగా తన వీపుపై విజయ్ దేవరకొండ ఫొటోను టాటూగా వేయించుకుంది. చెర్రీ అనే అమ్మాయి వీపుపై విజయ్ టాటూ వేయించుకుంది. ఈనేపథ్యంలో విజయ్ దేవరకొండను కూడా కలిసి ఆనందలో ఉబ్బితబ్బిబైపోయింది. ఇక విజయ్ కూడా తనతో ఆప్యాయంగా మాట్లాడి కొంచంసేపు ముచ్చటించారు. ఇప్పుడు ఈవీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

కాగా ప్రస్తుతం విజయ్ పూరీ కాంబినేషన్ లో ఫైటర్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ భాషలలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆగష్ట్ 25న ఈసినిమా రిలీజ్ అవుతుంది. ఇంకా పూరీతోనే జనగణమన సినిమా చేస్తున్నాడు. మరోవైపు శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్నాడు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =