బ్లాక్ బస్టర్ “అఖండ” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులను అలరించిన హీరో బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో “#NBK107 “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో “#NBK108 “మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. హీరో బాలకృష్ణ తనయగా శ్రీలీల నటించనున్న ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జోరుగా జరుగుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో బాలకృష్ణ తాను కరోనా బారిన పడిన విషయం స్వయంగా తెలియజేశారు. స్వల్ప అనారోగ్యానికి గురైన బాలయ్య వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల్లో ఆయనకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. విషయం తెలిసిన వెంటనే బాలకృష్ణ క్వారంటైన్ అయ్యారు. డాక్టర్స్ సలహాతో చికిత్స తీసుకుంటున్నారు. ఇక తనను కలిసిన వారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని బాలకృష్ణ విజ్ఞప్తి చేశారు. తాజా వైద్య పరీక్షలో బాలయ్యకు నెగిటివ్ రావడంతో బాలకృష్ణ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరో వారం రోజుల్లో తిరిగి బాలకృష్ణ షూటింగ్ లో జాయిన్ కానున్నారని సమాచారం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: