‘విక్రాంత్ రోణ’ ప్రముఖ సంస్థకు తెలుగు థియేట్రికల్ రైట్స్

Vikrant Rona Movie Telugu Rights Details,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Vikrant Rona,Vikrant Rona Movie,Vikrant Rona Telugu Movie,Vikrant Rona Movie Rights,Vikrant Rona Movie Latest Updates,Vikrant Rona Upcoming movies, Sudeep Vikrant Rona Movie Updates,Sudeep Upcoming Movie Vikrant Rona,Sudeep Movie Latest Updates,Warangal Srinu Acquired the Rights of Sudeep Vikrant Rona Movie, Film distributor Warangal Srinu Got the Movie Rights for Vikrant Rona Movie

ప్రస్తుతం తమిళ్ సినిమాలతో పాటు కన్నడ, మలయాళం సినిమాలు కూడా తెలుగులో రిలీజ్ అవుతున్నాయి. ఇక్కడ కూడా ఆ స్టార్ హీరోలకు మంచి మార్కెట్ ఉండటంతో ఒకేసారి రిలీజ్ చేయడానికి ముందుకొస్తున్నారు. ఈనేపథ్యంలోనే సుదీప్ హీరోగా వస్తున్న విక్రాంత్ రోణ సినిమాను కూడా ఇక్కడ రిలీజ్ చేస్తున్నాడు. ఈసినిమాను భారీ బడ్జెట్ తో యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యంలో, త్రీడీ ఫార్మట్ లో రూపొందించారు. ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. జూలై 28 న రిలీజ్ కానుండటంతో రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రస్తుతం చిత్రబృందం ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈసినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ ను ఓ ప్రముఖ సంస్థ దక్కించుకుంది. వరంగల్ శ్రీను పేరు అందరికీ తెలిసిందే కదా. కార్తికేయ గ్రూప్ ద్వారా తను ఇప్పటికే పలు తెలుగు సినిమాల రైట్స్ ను సొంతం చేసుకుంది. ఇప్పటికే ఇస్మార్ట్ శంకర్, సుల్తాన్, క్రాక్, సీటీమార్, ఆచార్య వంటి చిత్రాలను వరంగల్ శ్రీను డిస్ట్రీబ్యూట్ చేశాడు. ఇప్పుడు విక్రాంత్ రోణ తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్‌ని సొంతం చేసుకున్నాడు. తన కార్తికేయ గ్రూప్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వరంగల్ శ్రీను ఈ సినిమాను విడుదల చేయనున్నాడు.

కాగా జాన్‌ మంజునాథ్‌‌, శాలిని మంజునాథ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు బి.. అజనీశ్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి విలియమ్ డేవిడ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. ఇంకా ఈసినిమాలో నిరూప్ భండారి, నీతా అశోక్, జాక్వెలెన్ ఫెర్నాండేజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషలు సహా ఐదు విదేశీ భాషల్లో 50 దేశాల్లో ‘విక్రాంత్ రోణ’‌ చిత్రం విడుదల కానుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 5 =