ఫైనల్ వర్క్ లో బిజీగా “ఆదిపురుష్”

Adipurush Movie Busy In Final Work,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Adipurush,Adipurush Movie,Adipurush Telugu Movie,Adipurush Latest Movie Updates,Adipurush New Movie Updates,Adipurush Final Work Updates, Prabhas,Rebel Star Prabhas,Pan Indian Star Prabhas,Prabhas Adipurush Movie,Prabhas Upcoming Movie Adipurush in Final Work

టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “తానాజీ “మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారత చలన చిత్ర చరిత్ర లో అత్యధిక బడ్జెట్ తో, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కుతున్న “ఆదిపురుష్ ” మూవీ 2023 సంవత్సరం జనవరి 12వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటిస్తున్నారు.హీరో ప్రభాస్ ఫస్ట్ టైమ్ మైథలాజికల్ మూవీ లో నటించిన “ఆదిపురుష్ ” మూవీ ని ఇంగ్లీష్ తో పాటు పలు భాషలలో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఆదిపురుష్” మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇటీవల గ్రాఫిక్స్ పనులు కూడా దాదాపు తుది దశకు చేరుకున్నట్లు, ప్రస్తుతం ఫైనల్ వర్క్ తో బిజీగా ఉన్నట్లు సమాచారం. కొంతమంది నటీనటులు కూడా ఇప్పటికే వారికి సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేయగా , ప్రధాన తారాగణం డబ్బింగ్ వర్క్ ను పూర్తి చేసే పనిలో చిత్ర యూనిట్ బిజీగా ఉన్నట్లు సమాచారం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ మూవీ తో పాటు”సలార్”, “ప్రాజెక్ట్ K” మూవీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + 5 =