మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుండగా ఇందులో చరణ్ రెండు డిఫరెంట్ షెడ్స్ లో నటించనున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా ఎప్పుడో మొదలైంది. ఇప్పటివరకూ కొంత షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. అయితే మధ్యలో చరణ్ ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాల రిలీజ్ లు ఉండటంతో ఆసినిమాలతో బిజీ అవ్వడంతో ఈసినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక మళ్లీ ఇప్పుడు ఈసినిమా షూటింగ్ ను స్టార్ట్ చేశారు మేకర్స్. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే కదా. థమన్ కూడా తను వర్క్ చేసే సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తూనే ఉంటాడు. ఈనేపథ్యంలో ఈసినిమా మ్యూజిక్ పనుల గురించి అప్ డేట్ ఇచ్చాడు. తాజాగా తన సోషల్ మీడియా ద్వారా తను-శంకర్ ఉన్న ఫొటోను పోస్ట్ చేస్తూ బ్రిలియంట్ హ్యూమన్ శంకర్ గారితో ఆర్సీ 15 మ్యూజిక్ కంపోజిషన్స్.. ఇప్పటివరకూ రామ్ చరణ్ తో అమెజింగ్ జర్నీ కొనసాగింది అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు.
#RC15 Compositions With this Super Brilliant Human @shankarshanmugh Sir🤍 .. amazing journey so far with our dear @AlwaysRamCharan gaaru 🎧♥️ @SVC_official 💥 pic.twitter.com/g1WGZU2Hrb
— thaman S (@MusicThaman) June 24, 2022
కాగా భారీ బడ్జెట్ తో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో శ్రీకాంత్, మలయాళ హీరో సురేష్ గోపి నెగిటివ్ రోల్స్‌లో కనిపించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మిగతా పాత్రల్లో సునీల్, అంజలి, నవీన్ చంద్ర కనిపించనున్నారు. పాన్ ఇండియా లెవల్లో భారీగా నిర్మితమవుతోన్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: