కన్ఫామ్.. 2023 పొంగల్ బరిలో ‘మెగా154’

#Mega154 Release Date Fixed,Mega154 Will Be Released For Sankranthi 2023,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Mega154,Mega154 Movie,Mega154 Telugu Movie,Mega154 Releasing On Sankranthi,Chiranjeevi Mega154 Movie,Chiranjeevi Latest Movie Mega154 Releasing on Sankranthi, Chiranjeevi Upcoming Movie Mega154 Latest Updates,Chiranjeevi Upcoming Movie Releasing on Sankranthi 2023,Mega154 in 2023 For Sankranthi,Chiranjeevi New Movie, Chiranjeevi Next Projects,Chiranjeevi latest Projects Updates

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గానే ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ప్రస్తుతం తన తదుపరి సినిమాలపై దృష్టి పెడుతున్నాడు. చిరు ప్రస్తుతం అయితే మెహన్ రాజా తో గాడ్ ఫాదర్ అలానే మెహర్ రమేష్ తో భోళా శంకర్ ఇంకా బాబి తో మరో సినిమా చేస్తున్నాడు. మూడు సినిమాకూడా సెట్స్ పైనే ఉన్నాయి. వాటిలో గాడ్ ఫాదర్ సినిమా మాత్రం తప్పకుండా ఆ ఏడాదే వచ్చేస్తుంది. ఇక ఇప్పుడు మరో సినిమాపై కూడా క్లారిటీ వచ్చేసింది. బాబి దర్శకత్వంలో వస్తున్న సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదన్న సంగతి తెలిసిందే కదా. మెగా 154 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా చిత్రీకరణ జరుపుకుంటుంది. అయితే వాల్తేరు వీరయ్య అనే టైటిల్ నే ఈసినిమాకు ఫిక్స్ చేయనున్నట్టు ఈమధ్య వార్తలు కూడా వచ్చాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా నేడు ఈసినిమా రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. 2023 పొంగల్ బరిలోకి ఈసినిమాను దించనున్నారు. 2023 సంక్రాంతికి జ‌న‌వ‌రిలో క‌లుద్దాం అంటూ మెగాస్టార్ చిరంజీవి చేయి ఉన్న పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

కాగా ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈసినిమాను బాబి మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించబోతున్నాడు. ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + eight =