తమిళ్ స్టార్ హీరో విజయ్ ఫ్యాన్స్ కు మాత్రం వరుసగా పోస్టర్లు రిలీజ్ చేస్తూ ఫుల్ ట్రీట్ ఇస్తున్నారు వారిసు మేకర్స్. నేడు విజయ్ పుట్టిన రోజు అన్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో నిన్నటి నుండే హడావుడి మొదలైంది. ఆయన సినిమాల నుండి వరుసగా అప్ డేట్స్ ఇస్తూ అభిమానులను సర్ ప్రైజ్ చేస్తున్నారు. ఇక వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా కూడా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా తెలుగు, తమిళ్ రెండు భాషల్లో కూాడా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా నుండి విజయ్ బర్త్ డేకు అప్ డేట్ వచ్చేసింది. ఈసినిమా నుండి నిన్న ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈరోజు ఉదయం సెకండ్ లుక్ ను రిలీజ్ చేశారు. రెండు పోస్టర్లూ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇక తాజాగా మూడో లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మూడో లుక్ కూడా అందర్నీ ఆకట్టుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Thalapathy signs off in style #VarisuThirdLook. #Varisu#HBDDearThalapathyVijay
Thalapathy @actorvijay sir @directorvamshi @iamRashmika @MusicThaman @Cinemainmygenes @KarthikPalanidp pic.twitter.com/ya1SJKvn77
— Sri Venkateswara Creations (@SVC_official) June 22, 2022
కాగా ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. మహర్షి తరువాత వంశీ విజయ్ తో ఓ పవర్ ఫుల్ కథతో వస్తున్నట్టు తెలుస్తుంది. ఈసినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్, శ్యామ్, ప్రకాశ్ రాజ్, సంగీత, జయసుధ, ప్రభు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈసినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు.



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.