టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య కూడా విభిన్నమైన కథలతో వరుస హిట్లను సొంతం చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. గత ఏడాది లవ్ స్టోరీ, ఈఏడాది బంగార్రాజు సినిమాలతో హిట్లను తన ఖాతాలో వేసుకున్న చైతు ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా వస్తున్న సినిమా థాంక్యూ. ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తుండగా.. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాను లైన్ లో పెడుతున్నాడు నాగచైతన్య.శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నాగచైతన్య హీరోగా ఈ కొత్త సినిమా రూపొందుతుంది. చైతు కెరీర్ లో 22వ సినిమాగా ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమాకు సంబంధించి సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చింది చిత్రనిర్మాణ సంస్థ. రేపు ఉదయం 9 గంటల 1 నిమిషానికి ఈసినిమా నుండి బిగ్ అనౌన్స్ మెంట్ ఇవ్వనున్నట్టు పోస్ట్ లో పేర్కొన్నారు. మరి ఆ అప్ డేట్ ఏం అయి ఉంటుందో అని చైతు ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
All Set for the BIG Announcement🤘💥
We’re taking the Excitement to the Next Level🔥
Tomorrow at 09:01 AM⌛ #NC22
Keep Guessing & Stay Glued with the Space@chay_akkineni @vp_offl @srinivasaaoffl @SS_Screens pic.twitter.com/s5nXQRL563
— Srinivasaa Silver Screen (@SS_Screens) June 22, 2022




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.