ప్రస్తుతం వరుస హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు తమిళ్ టాలెంటెడ్ హీరో శివకార్తికేయన్. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరో రేంజ్ కు ఎదిగిపోయాడు. రీసెంట్ గా డాక్టర్ ఇంకా డాన్ సినిమాలతో సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక మరోవైపు శివ కార్తికేయన్ తెలుగులో కూడా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా ప్రిన్స్ సినిమా తెరకెక్కు తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈమధ్య ఈసినిమా నుండి పోస్టర్లు రిలీజ్ చేయగా అవి అందరినీ ఆక్టటుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా రిలీజ్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ఈమేరకు ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఆ వీడియోలో అనుదీప్, శివకార్తికేయన్, హీరోయిన్ మారియా, సత్యరాజ్ కూడా ఉన్నారు. ఈసినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయిందంటూ వార్తలు వస్తున్నాయి.. అందులో ఎలాంటి నిజం లేదు.. రిలీజ్ కేవలం లేట్ అవుతుంది అంటూ మొదలైన ఈవీడియో చాలా ఫన్నీగా ఉంది. ఈసినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవ్వడానికి కారణం సత్యరాజ్ సార్.. బాహుబలి సినిమా తరువాత ఆయన పాన్ ఇండియా స్టార్ అయిపోయారు.. అప్పటినుండి చాాలా మారిపోయారు.. దీంతో సినిమా రిలీజ్ విషయంలో కూడా డిమాండ్ చేస్తున్నారు.. అంటూ శివకార్తికేయన్ చెప్పడం.. ఆ తరువాత.. ఆఫ్గనిస్తాన్, కజికిస్థాన్, ఉజ్బేకిస్థాన్, అంటార్కిటికాలో విడుదల చేయాలనుకున్నా… ఆఫ్గనిస్తాన్లో థియేటర్లు లేవు… కజికిస్థాన్లో డిస్ట్రిబ్యూటర్లు లేరు… ఉజ్బేకిస్థాన్లో మార్కెట్ లేదు. అందుకని, తెలుగు – తమిళ భాషల్లో విడుదల చేస్తున్నాం” అంటూ ఫైనల్ గా ఈ సినిమాను దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్టు నేడు అనౌన్స్ చేశారు.
#PrinceForDiwali 💥 here’s the official announcement video!🇮🇳🕊🇬🇧https://t.co/Bc849MvWP1#Sathyaraj sir @anudeepfilm #MariaRyaboshapka @MusicThaman @manojdft @Premgiamaren @Cinemainmygenes @SVCLLP @SureshProdns @ShanthiTalkies @Gopuram_Cinemas
— Sivakarthikeyan (@Siva_Kartikeyan) June 21, 2022
కాగా ఈసినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్స్ పై నారాయణ్ దాస్ కె. నారంగ్, సురేష్ బాబు, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: