ఆ సినిమాల రేంజ్ లోనే ప్రభాస్ సినిమా ఉంటుంది..!

Director Maruthi About Prabhas Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Prabhas,Pan India Star Prabhas,Rebel Star Prabhas,Prabhas Upcoming Movies,Prabhas New Movie Updates,Prabhas Latest Movies, Prabhas Movie With Director Maruthi,Director Maruthi,Maruthi Upcoming Movies,Maruthi New Movie updates,maruthi latest Movie Updates, Maruthi About Movie with Prabhas,Maruthi Movie with Pan Indian Star Prabhas,Maruthi Upcoming Movie with Prabhas,Maruthi Movie Updates

ఇండస్ట్రీలో ఒక్కో డైరెక్టర్ కు ఒక్కో స్టైల్ ఉంటుంది. ఇక మారుతి కూడా తనకంటూ సెపరేట్ మార్క్ ను క్రియేట్ చేసుకోగలిగాడు. ఎక్కువగా కామెడీ కథలను అలానే కామెడీ తో పాటు యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్లను తెరకెక్కించడం మారుతి స్పెషల్. ఇక ఇప్పటివరకూ తన కెరీర్ లో తను అందుకున్న విజయాలు కూడా ఎక్కువే. ప్రస్తుతం అయితే తన దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కిన పక్కా కమర్షియల్ సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా.. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా రాబోతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ మాత్రం ప్రస్తుతం పాన్ ఇండియా భారీ బడ్జెట్ సినిమాలే చేస్తున్నాడు. మరోవైపు మారుతి ఇప్పటివరకూ పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టలేదు. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో ఎలాంటి సినిమా వస్తుందో అన్న అనుమానాలు అయితే అందరికీ ఉన్నాయి. ఎందుకంటే ప్రభాస్ రేంజ్ పెరిగిపోయింది.. ఏదో కమర్షియల్ సినిమా చేస్తే పని అయిపోతుంది అన్న పరిస్థితి లేదు.

ఈనేపథ్యంలో తాజాాాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మారుతి ఈ వార్తలకు క్లారిటీ ఇచ్చాడు. ప్రభాస్ సినిమా తీయడం అనేది ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది. నేను ఎలా సినిమాలు తీస్తానో.. నా మార్క్ అలాగే ఉంటుంది.. దానికి ప్రభాస్ యాక్షన్ తోడవుతుంది. ప్రభాస్ కి నేను పెద్ద అభిమానిని .. ఆయన సినిమాలు ఎలా ఉండాలని నేను కోరుకుంటానో అలాగే ఆయనను చూపిస్తాను. ప్రభాస్ ఫ్యాన్స్ ఆశించే మాదిరిగానే ఈ సినిమా ఉంటుంది. ఒక ‘బుజ్జిగాడు’ .. ఒక ‘డార్లింగ్’ తరహా కథనే ఆయనకి నేను వినిపించాను. ఆ తరహాలోనే అంతకి మించి అన్నట్టుగా ఈ సినిమా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. మరి పాన్ ఇండియా అనే సట్రం నుండి ప్రభాస్ బయటకు వచ్చి అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు తీయడం కూడా మంచిదే.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 2 =