టాలీవుడ్లో క్రియేటివ్ డైరెక్టర్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన డైరెక్టర్ కృష్ణవంశీ. ప్రస్తుతం కృష్ణ వంశీ దర్శకత్వంలో వస్తున్న సినిమా రంగమార్తాండ. మరాఠీలో ఘనవిజయం సాధించిన ‘నటసమ్రాట్’కు రంగమార్తాండ తెలుగు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. చాలా గ్యాప్ తరువాత కృష్ణవంశీ ఈసినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈసినిమా షూటింగ్ పూర్తయింది. గతకొంతకాలంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అయితే ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చివరిదశకు చేరుకున్నట్టే అని తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చాడు కృష్ణవంశీ. ఈసినిమాకు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్న తెలిసిందే కదా. ఈనేపథ్యంలో ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ గురించి అప్ డేట్స్ ఇస్తూ..సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పనులు కూడా పూర్తి అయ్యాయని, అవుట్ పుట్ చాలా బాగా రావడం సంతోషంగా ఉందని చెప్పాడు.
Day8 …..#rangamarthanda…….my biggest n precious asset I hv earned in my life …GODs blessing …. Like all great things end some time bgscore also completed successfully n most satisfactoryly……it’s a spiritual experience 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 pic.twitter.com/ipQEz0HuCP
— Krishna Vamsi (@director_kv) June 16, 2022
కాగా ఈసినిమాలో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, అనసూయ భరద్వాజ్, బ్రహ్మానందం, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్ ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.