మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. “పుష్ప: ది రైజ్” మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. .“పుష్ప :ది రైజ్”మూవీ హిందీ వెర్షన్ కూడా ఘనవిజయం సాధించి, బాలీవుడ్ లో అల్లు అర్జున్ పై క్రేజ్ పెంచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ సెకండ్ పార్ట్ “పుష్ప :ది రూల్” మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. దర్శకుడు సుకుమార్ స్క్రిప్ట్ కంప్లీట్ చేసినట్టు , స్క్రిప్ట్ , బడ్జెట్ ను మేకర్స్ లాక్ చేసినట్టు, అల్లు అర్జున్ తన పాత్ర కై ఫుల్ ప్రిపరేషన్ లో ఉన్నట్టు,రెండు నెలలలో “పుష్ప :ది రూల్” మూవీ సెట్స్ పైకి వెళ్ళనున్నట్టు సమాచారం. “పుష్ప :ది రూల్” మూవీ తన కెరీర్ ను ఛేంజ్ చేస్తుందనీ , ట్రూ పాన్ ఇండియా స్టార్ గా ఎస్టాబ్లిష్ చేస్తుందనీ హీరో అల్లు అర్జున్ ఆశాభావం తో ఉన్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: