బాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్లు రణబీర్ కపూర్, అలియా భట్ జోడిగా నటిస్తోన్న భారీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. తెలుగులో ఈసినిమా బ్రహ్మాస్త్రం పేరుతో రిలీజ్ అవుతుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో ఫస్ట్ పార్ట్ బ్రహ్మాస్త్ర శివ పేరుతో రిలీజ్ కాబోతుంది. ఫస్ట్ పార్ట్ ను సెప్టెంబర్ 9న వరల్డ్ వైడ్‌గా భారీ స్థాయిలో ఈసినిమాను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం అయితే ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో కీలకపాత్రల్లో నటిస్తున్న నటీనటుల లుక్స్ ను వారు పోషిస్తున్న పాత్రలను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అమితాబ్ లుక్, అలానే నాగ్ లుక్ ను రిలీజ్ చేయగా ఇప్పుడు ఈసినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్న మౌనిరాయ్ పాత్రకు సంబంధించిన లుక్ ను రిలీజ్ చేశారు. చీకటి రాణిగా జునూన్ అనే పాత్రలో మౌని రాయ్ నటిస్తుంది. అందరిని తన వశం లోకి తీసుకునే చీకటి కి రాణి.. బ్రహ్మాస్త్రాన్ని తన సొంతం చేసుకోవడమే జునూన్ లక్ష్యం అంటూ పాత్రను రివీల్ చేశారు. ఇక లుక్ ను చూస్తుంటే మౌని రాయ్ నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్టే అర్థమవుతుంది.
View this post on Instagram
ఇక ఈసినిమా ట్రైలర్ ను ఈనెల 15వ తేదీన రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక బ్రహ్మాస్త్ర తెలుగు ట్రైలర్‌కు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్‌ను అందిస్తున్నారు. దీంతో ఈట్రైలర్ పై మరింత ఆసక్తి పెరిగింది. కాగా ఈసినిమాను ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, రణ్ బీర్ కపూర్, అయాన్ ముఖర్జీ, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా బ్రహ్మాస్త్ర చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈసినిమాకు ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: