వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని, నజ్రియా హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా అంటే సుందరానికీ. ఈసినిమా ఈనెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. నాని మరో సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు హిట్ టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇక ఈనేపథ్యంలో చిత్రయూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ ను మొదలుపెట్టారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సెక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న నాని మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసినిమా రిలీజ్ అయి మూడు రోజులే కదా అయింది అప్పుడే సెలబ్రేషన్స్ జరుపుతున్నారని అనుకోవచ్చు అయితే ఈసినిమా సెలబ్రేషన్స్ ను సినిమా చూసి ఆడియన్స్ ఎంజాయ్ చేసే తీరును చూసి చేసుకుంటున్నాము.. మేము లెక్కేసేది నెంబర్స్ ను కాదు .. ప్రేక్షకుల ప్రేమను .. వాళ్ల హార్ట్స్ ను కౌంట్ చేస్తున్నాము. వాళ్లు చూపించే ప్రేమను లెక్కేస్తే ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసినట్టే. ఇది మనందరం సెలబ్రేట్ చేసుకోవలసిన సినిమా అని తెలిపాడు. అంతేకాదు మాస్ సినిమా చేస్తే .. మంచి సినిమా ఎప్పుడు చేస్తారని అడుగుతారు. మంచి సినిమా చేస్తే వేరే సినిమాలతో కంపేర్ చేస్తారు. ఒక మంచి సినిమా వచ్చినప్పుడు మనమంతా కూడా దానిని భుజాలపై మోయాలి. అప్పుడే తెలుగు సినిమా వేస్తున్న కొత్త అడుగుల్లో మనమంతా ఒక భాగమవుతాము. నా కెరియర్లో ఎప్పుడైనా వెనుదిరిగి చూసుకుంటే, గొప్పగా కనిపించే సినిమాల జాబితాలో ఈ సినిమా ఉంటుంది” అని చెప్పుకొచ్చాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: