రామ్ ‘ది వారియర్’ సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

The Warrior second single release date locked,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, The Warriorr,The Warriorr Movie,The Warriorr Telugu movie,The Warriorr Movie Updates,The Warriorr Upcoming Movie,The Warriorr Movie Latest updates, The Warriorr Songs,The Warriorr Second Song,The Warriorr Second Single,The Warriorr Second Single Release Date Fixed,The Warriorr Second Single Release Date Fixed, Ram The Warriorr Movie Updates,Hero Ram Upcoming Movie The Warriorr,Ram The Warriorr Movie Second Single Release Date Fixed,Ram Upcoming Movies,Ram Next Project Updates, Ram latest Movie Updates,Ram New Movie Shooting Updates

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ తమిళ డైరెక్టర్ లింగుస్వామితో చేస్తున్న సినిమా ది వారియర్. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్‌ తొలిసారి పోలీస్‌ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఇక రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈసినిమా కూడా ఆల్రెడీ రిలీజ్ అవ్వగా.. టీజర్‌కు టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుండటంతో ప్రమోషన్స్ కార్యక్రమాలు కూడా అదే రేంజ్ లో చేయాలని ఫిక్స్ అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరోవైపు మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుండి ఒక పాట రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా. బుల్లెట్ బండి అంటూ వచ్చే ఈపాట సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇక ఈసినిమా నుండి ఇప్పుడు సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు. దాని కోసం డేట్, టైమ్ ను కూడా ఫిక్స్ చేశారు మేకర్స్. జూన్ 4వ తేదీన మధ్యాహ్నం 12:07 నిమిషాలకు సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నట్టు చెబుతూ ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ‘దడ దడ’ అంటూ ఈపాట కొనసాగనుంది.

కాగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోన్న ఈసినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. విజిల్ మహాలక్ష్మి పాత్రలో కనిపించనుంది. అక్షర గౌడ మరో కీలక పాత్రలో కనిపించనుంది.ఆది పినిశెట్టి విలన్‌గా కనిపించనున్నారు. ఈసినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + fourteen =