‘7 డేస్ 6 నైట్స్’ రిలీజ్ డేట్ ఫిక్స్

7 Days 6 Nights Release Date Locked,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, 7 Days 6 Nights,7 Days 6 Nights Movie,7 Days 6 Nights Telugu Movie,7 Days 6 Nights Movie Latest Updates,7 Days 6 Nights Releasee Date Fixed, 7 Days 6 Nights Movie Latest Release Date Fixed,7 Days 6 Nights Movie Release Updates,7 Days 6 Nights Releasing On 24th June,Sumanth Ashwin 7 Days 6 Nights Movie Releasing date Fixed

నిర్మాతగా సూపర్ డూపర్ బ్లాక్‌బస్టర్స్ ప్రేక్షకులకు అందించిన ఎం.ఎస్. రాజు ‘డర్టీ హరి’ సినిమాతో దర్శకుడిగా మారారు. ఇక థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. అదే జోష్ తో ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో వచ్చేస్తున్నారు. సుమంత్ అశ్విన్ హీరోగా, మెహర్ చాహల్ హీరోయిన్ గా ఎం.ఎస్ రాజు దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘7 డేస్ 6 నైట్స్’ . ఈసినిమా కూడా ఎప్పుడో షూటింగ్ పూర్తిచేసుకొని రిలీజ్ కోసం ఎదురుచూస్తుంది. ఫైనల్ గా ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. జూన్ 24వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా హీరో, నిర్మాత సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ.. “ఈ చిత్రాన్ని హైద్రాబాద్‌, బెంగళూరు, ఉడిపి, గోకర్ణ, గోవా పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించాం. డర్టీ హరి తరువాత మా నాన్న ఎం.ఎస్. రాజు గారి దర్శకత్వంలో రానున్న ఈ యూత్‌ఫుల్ కంటెంట్‌ సినిమా పై చాలా అంచనాలున్నాయి. పాటలు, నేపథ్య సంగీతం, మునుపెన్నడూ చూడని గోవా అందాలు, ఆద్యంతం నవ్వించే కవ్వించే సన్నివేశాలతో అందరికీ నచ్చే యూత్ సినిమా ఇది.” అని అన్నారు.

దర్శకుడు ఎంఎస్ రాజు మాట్లాడుతూ.. ఫైనల్ కాపీ మా చేతిలోకి వచ్చినా, కరోనా మూడవ వేవ్ ముందస్తు చర్యలు అలాగే మన పెద్ద సినిమాల విడుదల నేపథ్యంలో కచ్చితంగా థియేటర్ల లోనే విడుదల చేయాలన్న ధ్రుడ నిశ్చయంతోనే మా ‘7 డేస్ 6 నైట్స్’ ని ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి ఇంత సమయం తీసుకున్నాం. ఆకట్టుకునే కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, విజువల్స్, మ్యూజిక్ తో ఈ చిత్రం కేవలం యూత్ కి మాత్రమే కాక అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుంది. కొత్త కథలతో రావాలన్న నా కోరిక మేరకు డర్టీ హరి లాంటి చిత్రం తరువాత ఒక లైట్ హార్టెడ్ ఎంటర్టైనర్ గా, అంచనాలకి ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నాం. హీరో సుమంత్ అశ్విన్ ఇందులో పూర్తి భిన్నమైన పాత్రలో చాలా ఒదిగిపోయి నటించాడు. హీరోయిన్ మెహర్ చాహల్ మరో జంట రోహన్, క్రితికా శెట్టి తొలి పరిచయం అయినా అద్భుతంగా నటించారు పాత్రలకి పూర్తి న్యాయం చేసారు. ఈ నెల జూన్ 24న థియేటర్లలో విడుదల కానున్న మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను” అని అన్నారు.

సహ నిర్మాతలలో ఒకరైన జె. శ్రీనివాసరాజు మాట్లాడుతూ “మెగా ఫిల్మ్ మేకర్ మా ఎం.ఎస్.రాజు గారి దర్శకత్వంలో మెగా బ్యానర్ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో బ్లాక్ బస్టర్ డర్టీ హరి తరువాత రానున్న ఈ చిత్రం పై భారీ అంచనాలుండడంతో థియేటర్స్ లో నే విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. ఆకట్టుకునే సన్నివేశాలు కథనాలతో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం కచ్చితంగా మరో బ్లాక్ బస్టర్ అవుతుందని పూర్తి నమ్మకంతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం” అని అన్నారు.

కాగా ఈ చిత్రం లో మరో జంటగా రోహన్, క్రితికా శెట్టిని పరిచయం చేస్తున్నారు. మరో ఇద్దరు అందమైన అమ్మాయిలు సుష్మ, రిషికా బాలి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ ఫేమ్ గోపరాజు రమణ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఈసినిమాను వైల్డ్ హనీ ప్రొడక్షన్స్ లో సుమంత్ అశ్విన్, వింటేజ్ పిక్చర్స్ మరియుఏబిజి క్రియేషన్స్ బ్యానర్స్ పై రజనీకాంత్.ఎస్ తో కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈసినిమాకు సమర్థ్‌ గొల్లపూడి సంగీతం అందిస్తుండగా నాని చమిడి శెట్టి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − six =