నెటిజన్ కు ‘సామ్’ కూల్ కౌంటర్..!

Samantha counter to netizen goes viral,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Samantha,Actress Samantha,Samantha Movie Updates,Samantha Upcoming Movies,Samantha Latest Movie Updates,Samantha Cool Counter to Netizen,Samantha Counter to Netizen, Samantha Latest Shoot Updates,Samantha Latest News,Samantha Counter on netizens Goes Viral,Samantha Comments on Netizens Goes Viral in Social media

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇటీవల కాస్త డల్ అయినా కూడా అప్పుడప్పుడు మాత్రం ఏదో ఒకటి పోస్ట్ చేస్తూనే ఉంటుంది. ఇక సామ్ కు నెటిజన్స్ నుండి కామెంట్స్ రావడం కొత్తేమీ కాదు. ఎవరో ఒకరు ఏదో ఒక కామెంట్ చేయడం దానికి సామ్ కూడారివర్స్ లో స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. ఇక తాజాగా ఇలాంటి ఘటన మరోసారి చోటుచేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సామ్ కు పెట్స్ అంటే చాలా ఇష్టమన్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో తాజాగా తన సోషల్ మీడియా వేదికగా.. వాటితో దిగిన ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేసింది సమంత. ఇక దీనికి ఒక నెటిజన్ ‘తన పెట్స్‌ కుక్కలు, పిల్లులతో ఆమె ఒంటరిగా చనిపోవాలి’ అంటూ కామెంట్‌ పెట్టాడు. మరి ఇలాంటి కామెంట్స్ వస్తే సామ్ సైలెంట్ గా ఉండదు కదా. తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చేసింది. అదే జరిగితే నన్ను నేను అదృష్టవంతురాలిగా భావిస్తాను’ అంటూ తనదైన శైలిలో రిప్లై ఇచ్చింది. ఇక దీనిపై స్పందించిన పలువురు నెటిజన్లు సదరు నెటిజన్ ను విమర్శించారు. దీంతో తన కామెంట్ ను డిలీట్ చేశాడు సదరు నెటిజన్. అయినా కూడా స్క్రీన్ షాట్ తీసి మరీ తిడుతున్నారు. మరోవైపు సమంతపై ప్రశంసలు కురిపించారు.

ఇక ప్రస్తుతం సమంత వరుస సినిమాలతో కెరీర్ లో బిజీగా ఉంది. తెలుగులో శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమాలో నటిస్తుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. గుణశేఖర్‌ దర్శకత్వంలో ‘శాకుంతలం’ సినిమా షూటింగ్‌ను ఇప్ప‌టికే పూర్తి చేసింది. ఇంకా యశోద సినిమా కూడా చేస్తుంది. తెలుగుతో పాటు అటు తమిళ్, హిందీలో కూడా నటిస్తుంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా చేస్తుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.