విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. ఎఫ్3 ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు. పాండమిక్ తర్వాత చాలా సినిమాలు వచ్చాయి. యూత్, మాసే థియేటర్ కి వస్తున్నారని వినిపించేది. దిల్ రాజు గారు, అనిల్ రావిపూడి మేము అంతా కలసి ఫ్యామిలీస్ ని థియేటర్ కి రప్పించాలనే లక్ష్యం పెట్టుకున్నాం. ఆ లక్ష్యం ఎఫ్ 3తో నెరవేరినందుకు ఆనందంగా వుంది. కుటుంబం అంతా కలిసొచ్చి ఎఫ్ 3 ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎఫ్ 2 తర్వాత నేను థియేటర్ కి వెళ్లి చూసిన సినిమా ఎఫ్ 3నే. దేవి థియేటర్ లో చూశాను. థియేటర్లో ప్రేక్షకులు రియాక్షన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తున్నారు. దిల్ రాజు గారు, శిరీష్ గారు ఎఫ్ 2 తర్వాత మళ్ళీ ఇంతపెద్ద ఎంటర్ టైనర్ తీసునందుకు సంతోషంగా వుంది. అనిల్ రావిపూడి ఎఫ్ 2 కంటే అద్భుతమైన వర్క్ చేశారు. ఎఫ్ 3 యూనిట్ అంతా వండర్ ఫుల్ టీం వర్క్ చేసింది. ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ వచ్చి ఎఫ్3 ని ఎంజాయ్ చేయాలి” అని కోరుకున్నారు .
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ” ఎఫ్ 3కి యునానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ రావడం ఆనందంగా వుంది. ఎఫ్ 3 చూసిన ప్రేక్షకులు సూపర్ ఎక్స్ ట్రార్డినరీ, అదిరిపోయిందిగా..! అంటున్నారు. ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తుంది. అనిల్ రావిపూడి, దిల్ రాజు గారు, వెంకటేష్ గారికి థ్యాంక్స్. వెంకటేష్ గారితో అద్భుతమైన కెమిస్ట్రీ కుదిరింది. మా కాంబినేషన్ ని ప్రేక్షకులు ఇంత గొప్పగా ఆదరించడం ఆనందంగా వుంది. ఎఫ్ 3 ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు” అన్నారు.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ఎఫ్ 3 చిత్రానికి మొదటి ఆట నుంచే అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడం ఆనందంగా వుంది. ఎఫ్ 3తో మరో బిగ్గెస్ట్ సక్సెస్ ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఎఫ్ 3 మాకు చాలా ప్రత్యేకమైన చిత్రం. వెంకటేష్ గారి సీతమ్మవాటిట్లో సిరిమల్లె చెట్టు, ఎఫ్ 2, ఇప్పుడు ఎఫ్ 3 తో హ్యాట్రిక్ విజయం, అలాగే వరుణ్ తేజ్ తో ఫిదా, ఎఫ్ 2, ఇప్పుడు ఎఫ్ 3 హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడం చాలా ప్రత్యేకం. మాస్, క్లాస్, ఫ్యామిలీ, యూత్, కిడ్స్ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులు,.. అమెరికా, లండన్, రాయలసీమ, కోస్తా, నిజాం ఇలా యూనివర్శల్ గా అన్ని ఏరియాల నుండి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించారు. వెంకటేష్ గారు, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడితో మా జర్నీ విజయవంతంగా కొనసాగుతున్నందుకు ఆనందంగా వుంది. బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు” తెలిపారు.
దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఎఫ్ 3ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఉదయం నుండి ‘ఎనీ సెంటర్ సింగల్ టాక్ బ్లాక్ బస్టర్’ అనే మాటే వినిపిస్తుంది. ప్రేక్షకులు థియేటర్ లో పడిపడి నవ్వుతున్నారు. ఎఫ్ 2 కంటే గొప్ప రెస్పాన్స్ వచ్చింది. ఎఫ్ 3 రెండేళ్ళ ప్రయాణం. అందరం ఒక ఫ్యామిలీలా పని చేశాం. దిల్ రాజు గారు, శిరీష్ గారితో ఇది నాకు ఐదో సినిమా. ఈ రోజు ఉదయం రాజుగారికి ఒక హ్యాపీ హగ్ ఇచ్చాను. వెంకటేష్ గారికి బిగ్ థ్యాంక్స్. ఒక స్టార్ ఇమేజ్ వుండి కామెడీని ఇలా పండించడం చాలా కష్టం. ఈ విషయంలో వెంకటేష్ గారికి స్పెషల్ థ్యాంక్స్. ఒకొక్క ఎపిసోడ్ ని ప్రేక్షకులు సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఎఫ్ 3ని మరో లెవెల్ కి తీసుకెళ్ళిందుకు ఆనందంగా వుంది. వరుణ్ తేజ్ అద్భుతంగా చేశారు. ఈ ప్రయాణం ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను. ఇలా హాయిగా నవ్వుకునే సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. ప్యామిలీ అంతా కలసి వెళ్ళండి… హాయిగా నవ్వుకోండి” అన్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































