నాగార్జున కోసం టెంపుల్ కట్టించిన అభిమాని..!

Temple constructed for Nagarjuna,Nagarjuna Fan Builds Annamayya Temple In Guntur,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Akkineni Nagarjuna's die-hard fan builds Annamayya temple,Nagarjuna Fan Builds Annamacharya Temple In Guntur,Nagarjuna fan builts an Annamacharya Temple at his own expense of Rs 1 crore,Nagarjuna,Akkineni Nagarjuna

తమ అభిమాన హీరోలను అభిమానులు ఎలా ఆదరిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ ఇండస్ట్రీలో అయినా సరే ఏ హీరోలకు ఆ అభిమానులు ఉంటారు.. వారి మీద అభిమానం, ప్రేమను చూపిస్తుంటారు. కొంత మంది అభిమానులు అయితే గుడులు కట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి. కుష్బు, నమిత లాంటి హీరోయిన్లకు వారి అభిమానులు గుడి కూడా కట్టించారంటేనే అర్ధం చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు మన తెలుగులో కూడా ఒక హీరో మీద అభిమానంతో గుడి కట్టించాడు ఓ అభిమాని. ఆహీరో ఎవరో కాదు.. టాలీవుడ్ అగ్రనటుడు నాగార్జున. గుంటూరుకు చెందిన ఓ అభిమాని 1997 లోనాగార్జున కోసం అన్నమాచార్య గుడిని కట్టించాలని.. దానికోసం పునాది కూడా వేశాడు. ఇక ఇప్పుడు దాదాపు 22 ఏళ్లకు ఆ ఆలయం పూర్తయినట్టు తెలుస్తుంది. ఈ ఆలయం కట్టడానికి దాదాపు రూ. కోటి ఖర్చయినట్టు తెలుపుతున్నారు. తన సినిమాలతో, పాత్రలతో తనకు అభిమానిగా మారి ఆయన కోసం ఈ ఆలయం కట్టాలని నిర్ణయించుకున్నాడట ఆ అభిమాని. మరి దీనిపై నాగార్జున ఎలా స్పందిస్తారో చూద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రస్తుతం నాగ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ది ఘోస్ట్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈసినిమాలో సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తుంది. యాక్షన్ స్పై థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున, సోనాల్ చౌహాన్ ఇద్దరూ ఇంటర్‌పోల్ ఆఫీసర్స్‌గా కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమాలో గుల్‌పనాగ్‌, అనిఖ సురేంద్రన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.