‘సీతారామం’ రిలీజ్ డేట్ ఫిక్స్

Seetha Ramam Release Date Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Seetha Ramam,Seetha Ramam Movie,Seetha Ramam Telugu Movie,Seetha Ramam Movie Updates,Seetha Ramam Telugu Movie Latest News,Seetha Ramam Release Date Locked,Seetha Ramam Movie Release Date Confirmed,Seetha Ramam Telugu Movie Release Date Fixed

మలయాళం లో సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు దుల్కర్ సల్మాన్. ఇక తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఓకే బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దుల్కర్ మహానటితో మరింత దగ్గరయ్యాడు. ఇక ఇప్పుడు ఏకంగా తెలుగులోనే సినిమా చేస్తున్నాడు. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సీతారామం అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక ఇప్పటికే ఈసినిమానుండి విడుద‌లైన గ్లింప్స్‌కు ప్రేక్ష‌కుల నుంచి విశేష స్పంద‌న వ‌చ్చింది. ఇక తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈసినిమాను ఆగష్ట్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా వైజయంతి మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో స్వ‌ప్న సినిమాస్ ప‌తాకంపై అశ్విని దత్‌, ప్రియాంక్‌ దత్‌ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లో లెఫ్టినెంట్ రామ్ పాత్ర‌లో న‌టిస్తుండగా మృణాళిని ఠాకూర్ సీత పాత్ర లో కనిపించనుంది. అఫ్రీన్‌ అనే కశ్మీర్‌కు చెందిన ముస్లిం యువతిగా రష్మిక నటిస్తోంది. ఇక ఈసినిమాలో సుమంత్, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్, రాహుల్ రవీంద్ర పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు పీఎస్ వినోద్ సినిమాట్రోగాఫర్ గా పనిచేస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + fourteen =