తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ, స్టార్ హీరో విజయ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా బిగిల్. వీరిద్దరి కాంబినేషన్ లో అప్పటికే మెర్సల్, సర్కార్ సినిమాలు రాగా బిగిల్ మూడో సినిమా. ఈసినిమాతో హ్యాట్రిక్ ను సొంతం చేసుకున్నారు ఇద్దరూ. ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్లకు పైనే గ్రాస్ ను రాబట్టి రికార్డు సృష్టించింది. ఇక విజయ్ కు తెలుగులో కూడా సూపర్ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే ఈసినిమాను తెలుగులో విజిల్ పేరుతో రిలీజ్ చేశారు. తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది ఈసినిమా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తాజాగా అట్లీ బిగిల్ 2 హింట్ ఇచ్చాడన్న అభిప్రాయాలు వస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే.. ఈసినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ సంస్థ సొంతం చేసుకుంది. ఈనేపథ్యంలో అమెజాన్ ప్రైమ్ వారు తమ అధికారిక ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేస్తూ విజయ్ చేసిన డ్యూయల్ రోల్స్ లో ఒకటైన రాయప్పన్ పాత్రపై కూడా ఒక సెపరేట్ సినిమా ఉంటే ఎలా ఉంటుంది అన్న ప్రశ్న ను అడిగారు. అయితే దానికి సమాధానంగా అట్లీ చేసేస్తే పోయే అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో ఇప్పుడు బిగిల్ 2 హింట్ వచ్చిందని.. అట్లీ బిగిల్ 2 హింట్ ఇచ్చాడని అంటున్నారు. మరి చూద్దాం దీనిపై ఏదైనా ప్రకటన వస్తుందేమో..
Senjittaaaaa pochuuuuu….. https://t.co/sfIxMt3RZb
— atlee (@Atlee_dir) May 24, 2022
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: