కర్ణాటకలో హైయ్యెస్ట్ వసూళ్ళను సాధించిన “ఆర్ ఆర్ ఆర్ “

RRR Movie Record Breaking Collections In Karnataka,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Movie Updates,RRR Telugu Movie Latest News,RRR Collections,RRR Movie Collections,RRR Telugu Movie Collections,RRR Box Office Collections,RRR Areawise Collections,RRR Movie Record Breaking Collections,Jr NTR,Ram Charan,Rajamouli

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 1,150 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ ప్రపంచవ్యాప్తంగా 500 సెంటర్స్ లో 50 రోజులు కంప్లీట్ చేసుకొనడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఆర్ ఆర్ ఆర్ ” మూవీ ఒక్కో ఏరియా లో థియేట్రికల్ రన్ ముగింపు దశలో చేరుకుంటుంది. తాజాగా ఈ సినిమా కర్ణాటకలో థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. “ఆర్ఆర్ఆర్” సినిమా కర్ణాటక లో రూ. 41 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే..రూ. 44.50 కోట్లను రాబట్టి బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. ఓవరాల్‌గా రూ. 83.40 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. మొత్తంగా రూ. 2.50 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. మొత్తంగా ఈ సినిమా కర్ణాటకలో ఓవరాల్‌గా హైయ్యెస్ట్ వసూళ్లను సాధించిన సినిమాగా నిలిచింది.”ఆర్ ఆర్ ఆర్” అమెరికాలో ఇప్పటికే 14 మిలియన్ డాలర్స్‌‌ పైగా వసూలు చేసి 100 కోట్ల‌కు పైగా గ్రాస్‌ను అందుకుంది . “ఆర్ ఆర్ ఆర్” సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 451 కోట్ల బిజినెస్ చేయగా… 453 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగింది. అయితే బ్రేక్ ఈవెన్ సాధించి అన్ని ఏరియాలలో లాభాలలో నడుస్తోంది..

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 3 =