పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన సినిమా ‘సర్కారు వారి పాట’. మే 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో మహేష్ నటన, ఫైట్లు, యూత్‌కు కనెక్ట్ అయ్యే డైలాగ్స్.. అన్నింటికీ మించి మహేష్ స్టైలిష్ గా కనిపించడంతో ఫిదా అయ్యారు. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో.. రికార్డు కలెక్షన్స్‌తో దూసుకెళుతోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నిర్మించిన ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటికే ఈసినిమా పలు రికార్డులు క్రియేట్ చేయగా.. తాజాగా మరో సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. ఈసినిమా రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇప్పుడు తాజాగా మరో రికార్డ్ ను క్రియేట్ చేసింది. 200 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ కూడా తెలిపింది. 12 రోజులో ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసినట్టు మైత్రి మూవీ మేకర్స్ స్వయంగా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేసింది. వేసవి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్’ అని కాప్షన్ ఇచ్చింది. అంతేకాదు 2022 తెలుగు సినీ ఇండస్ట్రీలో హైయెస్ట్ గ్రాసర్ అని కూడా పేర్కొంది. రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి రీజనల్ సినిమాగా ఎస్‌వీపీ ఆల్‌టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది.
Super🌟 @urstrulyMahesh sets an ALL TIME RECORD!❤️🔥❤️🔥#BlockbusterSVP becomes the BIGGEST GROSSER OF TFI IN 2022.
200+ Cr gross and going strong! 💥💥#SarkaruVaariPaataHits200Cr@KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @MythriOfficial @GMBents @14ReelsPlus pic.twitter.com/xx5PfLT5MD
— Telugu FilmNagar (@telugufilmnagar) May 24, 2022




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.