టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే.గుణ శేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మైథలాజికల్ మూవీ “శాకుంతలం” పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కానుంది. సమంత ప్రస్తుతం ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ “యశోద” మూవీలో నటిస్తున్నారు. ఒక ద్విభాషా చిత్రానికి , ఒక హాలీవుడ్ మూవీ , అమెరికన్ వెబ్ సిరీస్ “సిటాడెల్” ఆధారంగా తెరకెక్కించే హిందీ వెబ్ సిరీస్ కు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై కుటుంబ కథా చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ , సమంత జంటగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “ఖుషి ″మూవీ కశ్మీర్ లో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే.సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ సమంత ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా దర్శకుడు శివ నిర్వాణ, హీరో విజయ్ , స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ ఫొటో ను సమంత క్లిక్ చేసి ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా ఆ ఫొటో వైరల్ గా మారింది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: