పలు సూపర్ హిట్ మూవీస్ తో తమిళ ప్రేక్షకులతో పాటు డబ్బింగ్ వెర్షన్స్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ శివ కార్తికేయన్ కోలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోగా కొనసాగుతున్నారు. హీరో శివ కార్తికేయన్ ప్రస్తుతం బ్లాక్ బస్టర్ “జాతిరత్నాలు “మూవీ ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న “#SK 20 “మూవీ లో నటిస్తున్నారు. కమల్ హాసన్ స్వంత బ్యానర్ లో ఒక మూవీ కి శివకార్తికేయన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సూపర్ స్టార్ కమల్ హాసన్ స్వంత బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్, సోనీ పిక్చర్స్ బ్యానర్స్ పై రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం లో శివ కార్తికేయన్ హీరోగా ” మావీరన్ ″తమిళ మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ లో శివ కార్తికేయన్ కు జోడీగా సాయి పల్లవి ఎంపిక అయ్యారు. ఈ మూవీ కి హరీష్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు.టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి కథానాయికగా తెరకెక్కిన ”విరాటపర్వం “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.గౌతమ్ రామచంద్రన్ దర్వకత్వంలో సాయి పల్లవి ప్రధాన పాత్రలో ఉమెన్ సెంట్రిక్ మూవీ గా తమిళ, తెలుగు భాషలలో “గార్గి “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: