సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై ఆర్ . అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో చియాన్ విక్రమ్ , బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 “మూవీస్ ఫేమ్ శ్రీనిధిని శెట్టి జంటగా యాక్షన్ థ్రిల్లర్ “కోబ్రా “తమిళ మూవీ తెరకెక్కింది. ఈ మూవీ లో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ , మియా జార్జ్ , దర్శకుడు కె ఎస్ రవికుమార్ , ఆనంద్ రాజ్ ముఖ్య పాత్రలలో నటించారు. “కోబ్రా”మూవీ తో శ్రీనిధి శెట్టి కోలీవుడ్ కు కథానాయికగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీకి ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“కోబ్రా” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రయోగాత్మక మూవీస్ ఎంపిక చేసుకుని నటించే హీరో విక్రమ్ 58 వ మూవీ గా తెరకెక్కిన “కోబ్రా”మూవీలో 20 కు పైగా గెటప్స్ తో విక్రమ్ కనిపించనున్నారు.తాజాగా “కోబ్రా”మూవీ విడుదల తేదీని సోషల్ మీడియా ద్వారా మేకర్స్ అనౌన్స్ చేశారు. “కోబ్రా”మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 11 వ తేదీ రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ట్వీట్ చేశారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























