బ్లాక్ బస్టర్ “వకీల్ సాబ్ “మూవీ తో టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చి , బ్లాక్ బస్టర్ “భీమ్లా నాయక్” మూవీ లో తన పవర్ ఫుల్ డైలాగ్స్ , అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కాలం నేపథ్యంలో భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ “హరి హర వీరమల్లు ” పాన్ ఇండియా మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.హరీష్ శంకర్ దర్శకత్వంలో ”భవదీయుడు భగత్ సింగ్ “మూవీ కి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా బ్లాక్ బస్టర్ “గబ్బర్ సింగ్ “మూవీ ని తెరకెక్కించిన దర్శకుడు హరీష్ శంకర్ , మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై “భవదీయుడు భగత్ సింగ్ ” మూవీని తెరకెక్కించనున్నారు. ఈ మూవీ లో పూజాహెగ్డే కథానాయిక కాగా పంకజ్ త్రిపాఠి ఒక కీలక పాత్రలో నటించనున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై ఆసక్తిని కలిగించాయి. “భవదీయుడు భగత్ సింగ్ ” మూవీలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైమ్ లెక్చరర్ గా నటించనున్నారనీ , ఆగస్ట్ మొదటివారం లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళనుందనీ సమాచారం.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























