పోకిరి,దూకుడు కంటే ‘సర్కారు వారి పాట’ బాగుంది..!

Superstar Krishna is all praises for Mahesh Babu and Sarkaru Vaari Paata,Superstar Krishna About Mahesh Babu’s Sarkaru Vaari Paata,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Superstar Krishna,Senior Actor Superstar Krishna,Superstar Krishna About Mahesh Babu Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,Sarkaru Vaari Paata Telugu Movie, Senior Actor Superstar Krishna About Sarkaru Vaari Paata Movie,Sarkaru Vaari Paata Latest Updates,Mahesh’s extraordinary performance in Sarkaru Vaari paata Movie,Sarkaru Vaari Paata Biggest Summer Blockbuster

పరుశురాం దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన సినిమా సర్కారు వారి పాట. ఈసినిమా ఈనెల 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసినిమా ప్రస్తుతం సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటుంది. ఇక ఇప్పటివరకూ పలు సెలబ్రిటీలు ఈసినిమాపై స్పందిస్తూ సినిమా బాగుందని ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ స్పందిస్తూ ప్రశంసించారు. తాజాగా ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణ మాట్లాడుతూ.. చాలా కాలంగా బయటకు రావడంలేదు.. బయటకు వస్తుంటే స్ట్రైయిన్ అవుతున్నట్టు అనిపిస్తుంది.. అందుకే బయటకు రావడంలేదు. నా ఇంట్లోనే హోమ్ థియేటర్ ఉంది.. అందులోనే సినిమాలు చూస్తున్నాను.. ఈమధ్య వచ్చిన చాలా సినిమాలు అందులోనే చూశానని చెప్పారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక సర్కారు వారి పాట కూడా అందులోనే చూశా.. సినిమా చాలా బాగుంది.. పోకిరి, దూకుడు కన్నా కూడా ‘సర్కారు వారి పాట’ సినిమానే చాలా బాగుందని అన్నారు. అంతేకాదు.. పోకిరి సినిమాలో కంటే మహేష్ బాబు ఇప్పుడే చాలా బాగున్నాడని.. షూటింగులు లేనప్పుడు జిమ్ కు వెళ్తుంటాడని, అలా మెయింటెయిన్ చేస్తున్నాడు కాబట్టే అందంగా ఉన్నాడని చెప్పారు. ఇంకా తన సినిమాల్లో సామాజిక సమస్యలను కూడా చూపిస్తుండటం కూడా బాగుందని అన్నారు. దీనితో పాటు అల్లూరి సీతారామరాజు పాత్రను మహేష్ చేయడని కూడా స్పష్టం చేశారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 20 =