ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో నితిన్ హీరోగా వస్తున్న పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మాచర్ల నియోజకవర్గం’. ఈసినిమాతోనే రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇక ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది. ప్రస్తుతం ఈ చిత్రంలోని పాటలని ఇటలీ, ఆస్ట్రియాలోని అందమైన ప్రదేశాలలో చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే నితిన్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ , టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. పోస్టర్, టీజర్ వీడియోలో నితిన్ మునుపెన్నడూ లేని విధంగా డిఫరెంట్ యాక్షన్ లుక్ తో ఆకట్టుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలాఉండగా ఈసినిమాను ముందుగా జూలై 8న విడుదల చేయాలనుకున్నారు చిత్రయూనిట్. అయితే కొన్ని పనులు పెండింగ్ లో ఉండటం వల్ల ఈసినిమాను వాయిదా వేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఆగస్ట్ 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Date lo change anthe ⚠️
Collector Saab Action lo kaadhu 😎Youth🌟 @actor_nithiin’s
PAKKA MASS Entertainer #MacherlaNiyojakavargam Arriving in Theatres on August 12th, 2022🔥@IamKrithiShetty @CatherineTresa1 @SrSekkhar @SreshthMovies @adityamusic#MNVfromAug12th pic.twitter.com/xQcG0Jydx3— Sreshth Movies (@SreshthMovies) May 8, 2022
కాగా పొలిటికల్ నేపధ్యంలో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ సిద్ధార్థ్ రెడ్డి అనే ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక ఈసినిమాలో కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణ లో ,ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్, శ్రేష్ట్ మూవీస్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తుండగా, మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.