“వెళ్ళిపోమాకే “మూవీ తో హీరోగా పరిచయం అయిన విశ్వక్ సేన్ “ఈ నగరానికి ఏమైంది ?”, “ఫలక్ నుమా దాస్ “, “HIT – ది ఫస్ట్ కేస్ వంటి మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. “ఫలక్ నుమా దాస్ ” మూవీ తో విశ్వక్ దర్శకుడిగా మారారు. విశ్వక్ సేన్ హీరో గా తెరకెక్కిన “అశోకవనంలో అర్జున కళ్యాణం “మూవీ ఘనవిజయం సాధించింది. యాక్టర్ , ప్రొడ్యూసర్ , డైరెక్టర్ విశ్వక్ హీరోగా తెరకెక్కిన “ఓరి దేవుడా”మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వన్మయే క్రియేషన్స్ బ్యానర్ ఫై విశ్వక్ సేన్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ , నివేత పేతురాజ్ జంటగా కామెడీ థ్రిల్లర్ “ధమ్కీ”మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న “ధమ్కీ” మూవీ లో విశ్వక్ సేన్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తారనీ , ఒకటి హీరో రోల్ కాగా.. మరొకటి విలన్ రోల్ అని సమాచారం. హీరో, విలన్ గా నటించి విశ్వక్ సేన్ ప్రేక్షకులను అలరించనున్నారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: