ఈమధ్య హిట్ అయిన సినిమాకు సీక్వెల్ కు తీయడం కామన్ అయిపోయింది. వాటిలో కొన్ని సక్సెస్ అందించలేకపోయినా కొన్ని సినిమాలు మాత్రం మంచి విజయాన్నే అందించాయి. ఈ ఏడాది వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్ బంగార్రాజు.. అలానే కె.జి.యఫ్ చాప్టర్1 సీక్వెల్ కె.జి.యఫ్ చాప్టర్ 2 సినిమాలు వచ్చి ఎలాంటి హిట్లు అందిచాయో చూశాం. ఇక అలాంటి అంచనాల మధ్య వస్తున్న సినిమానే ఎఫ్3 సినిమా. అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చి సూపర్ హిట్ అయిన ఎఫ్ 2 సినిమాకు సీక్వెలే ఈ ఎఫ్3 సినిమా. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులను ముగించుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక మరోవైపు అప్పుడప్పుడు అప్ డేట్స్ ఇస్తూ చిన్నగా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈట్రైలర్ ఆద్యంతం కామెడీతో ఆకట్టుకుంది అని చెప్పొచ్చు. ట్రైలర్ విషయానికొస్తే.. మురళీ శర్మ వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అవుతుంది. ‘ప్రపంచానికి తెలిసిన పంచభూతాలు ఐదు. ఆరో భూతం ఒకటి ఉంది. అదే డబ్బు’ అని ఆయన డైలాగ్ చెప్పిన తర్వాత వెంకటేష్, వరుణ్ తేజ్ లను చూపించారు. రేచీకటి ఉన్న వ్యక్తిగా వెంకటేష్, నత్తితో ఇబ్బంది పడే యువకుడిగా వరుణ్ తేజ్ కనిపించారు. ‘డబ్బు ఉన్నవాడికి ఫన్, లేనివాడికి ఫ్రస్ట్రేషన్’ అనే డైలాగ్ క్యాచీగా ఉంది. ఆలీ, ‘వెన్నెల’ కిశోర్, రఘుబాబు తదితరులు నవ్వులు పూయించారు. ఈసినిమా కథ డబ్బు చుట్టూ తిరుగుతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇక ముందు నుండీ చెబుతున్నట్టు ఈసినిమా డబల్ డోస్ కామెడీ అందించేలా కనిపిస్తుంది.
The BIGGEST FUN FRANCHISE #F3Trailer is here🥳
▶️https://t.co/53HVON2BHNఇది ట్రైలర్ మాత్రమే😎
Laughs locked for May 27th🤩#F3Movie@VenkyMama @IAmVarunTej @AnilRavipudi @tamannaahspeaks @Mehreenpirzada @sonalchauhan7 @Mee_Sunil @ThisIsDSP @SVC_official @adityamusic#F3OnMay27 pic.twitter.com/LjvpW79CCh— Sri Venkateswara Creations (@SVC_official) May 9, 2022
కాగా ఈసినిమాలో తమన్నా, మెహ్రీన్ లు హీరోయిన్లుగా నటించగా సునీల్, సోనాల్‌చౌహన్‌లు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. పూజా హెగ్టే ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించనుంది. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌లు ఈ చిత్రాన్ని నిర్మించారు. మే 27వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.