బి వి ఎస్ ఎన్ ప్రసాద్ సమర్పణలో ఎస్ వి సి సి డిజిటల్ బ్యానర్ పై విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో విశ్వక్ సేన్, రుక్సార్ థిల్లాన్ జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “అశోకవనం లో అర్జున కళ్యాణం” మూవీ 6 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. రితిక నాయక్ , గోపరాజు రమణ ముఖ్య పాత్రలలో నటించారు. జై క్రిష్ సంగీతం అందించారు.ఈ మూవీ లో విశ్వక్ ఏజ్డ్ బ్యాచ్ లర్ గా ఫ్రస్ట్రేషన్ ఇతర ఎమోషన్స్ చాలా బాగా చేసి సినిమాలో మేజర్ అట్రాక్షన్ గా నిలిచారు .
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“అశోక వనంలో అర్జున కళ్యాణం”మూవీలో విశ్వక్ సేన్, రుక్సార్ థిల్లాన్ ల కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీ లో కీలక పాత్రలో నటించిన రితిక నాయక్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “అశోకవనం లో అర్జున కళ్యాణం” మూవీ సక్సెస్ సాధించిన సందర్భంగా ఆ మూవీ టీమ్ కు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సర్ ప్రైజ్ పార్టీ ఇచ్చారు. ఒక ప్రొడ్యూసర్ మూవీ సక్సెస్ ను మరొక ప్రొడ్యూసర్ సెలబ్రేట్ చేయడం విశేషం.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: