రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ తో ‘మేజర్’ టీమ్

Adivi Sesh Major Movie Team Met Centra Defense Minister,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Adivi Sesh,Hero Adivi Sesh,Adivi Sesh Movie Updates,Adivi Sesh Movie latest News,Adivi Sesh latest movie Updates,Adivi Sesh New Movies Updates, Adivi Sesh Major Movie,Adivi Sesh Major Movie Updates,Adivi Sesh Major Movie latest News,Adivi Sesh Major Movie Team Meets Defense Minister, Major Move Team Meets Centra Defense Minister,Major Adivi Sesh Movie Team Met Centra Defense Minister Rajnath Singh,Defense Minister Rajnath Singh, Major Movie Team Defense Minister Rajnath Singh

ఈ ఏడాది ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో అడివి శేష్ ‘మేజర్’ సినిమా కూడా ఒకటి. 26/11 హీరో ఎన్ఎస్జీ కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటంతో ఈసినిమాపై అందరికీ ఆసక్తి పెరిగింది. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ‘మేజర్’లో మేజర్ సందీప్ బాల్యం, సైన్యంలో పని చేసిన అద్భుతమైన ఘట్టాలు, ముంబై దాడిలో వీరమరణం.. ఇలా మేజర్ సందీప్ జీవితంలోని అపూర్వ సంఘటనలు, అతని జీవితానికి సంబంధించిన విభిన్న కోణాలను ఈసినిమాలో చూపించబోతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా తాజాగా చిత్రయూనిట్ భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అడివి శేష్, డైరెక్టర్ శశి కిరణ్ తిక్కా మంత్రితో భేటి అయ్యారు. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ను ప్రదర్శించి, మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కథ గురించి మాట్లాడారు. ఇదే సందర్భంలో రాజ్‌నాథ్ సింగ్ మేజర్ సినిమా నినాదాన్ని ఆవిష్కరించారు. ‘జాన్ దూంగా దేశ్ నహీ’ అనే నినాదాన్ని రివీల్ చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Sesh Adivi (@adivisesh)

ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుడు కథను చూపించబోతున్న దర్శకుడు శశి కిరణ్ తిక్క, అడివి శేష్‌లను అభినందించారు. చిత్ర యూనిట్ రక్షణ మంత్రి, కుటుంబ సభ్యుల కోసం సినిమా ప్రత్యేక స్క్రీనింగ్‌ ను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తుంది.

ఈ సినిమాలో శోభితా ధూళిపాళ్లతో పాటు స‌యీ మంజ్రేక‌ర్ కూడా మరో కథానాయికగా నటిస్తుంది. ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మహేష్‌ హోమ్ బేనర్‌ జీఎంబీ ప్రొడక్షన్స్‌ సోనీ పిక్చర్స్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, మలయాళంలో కూడా రిలీజ్ చేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here