అశోక వనంలో అర్జున కళ్యాణం : బి వి ఎస్ ఎన్ ప్రసాద్ సమర్పణలో ఎస్ వి సి సి డిజిటల్ బ్యానర్ పై విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో విశ్వక్ సేన్, రుక్సార్ థిల్లాన్ జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “అశోకవనం లో అర్జున కళ్యాణం” మూవీ ఈ రోజు రిలీజ్అయ్యింది. రితిక నాయక్ , గోపరాజు రమణ ముఖ్య పాత్రలలో నటించారు. జై క్రిష్ సంగీతం అందించారు. విశ్వక్ సేన్ ఇంతకు ముందు మూవీస్ లో మంచి అగ్రెసివ్ యంగ్ హీరోగా లవర్ బాయ్ లా నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో విశ్వక్ ఏజ్డ్ బ్యాచ్ లర్ గా ఫ్రస్ట్రేషన్ ఇతర ఎమోషన్స్ చాలా బాగా చేసి సినిమాలో మేజర్ అట్రాక్షన్ గా నిలిచారనీ , విశ్వక్ సేన్, రుక్సార్ థిల్లాన్ ల కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుందనీ సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
భళా తందనాన : సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్రం బ్యానర్ పై చైతన్య దంతులూరి దర్శకత్వంలో శ్రీవిష్ణు , క్యాథరిన్ థ్రెసా జంటగా తెరకెక్కినక్రైమ్ థ్రిల్లర్ “భళా తందనాన “మూవీ ఈ రోజు రిలీజ్ అయ్యింది. ఈ మూవీ లో రామచంద్ర రాజు , పోసాని , సత్య , అయ్యప్ప శర్మ , శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.ఫస్టాఫ్‌లో అమాయక చక్రవర్తిగా, సెకండాఫ్‌లో ఢిఫరెంట్ షేడ్స్ ఉన్న వ్యక్తిగా శ్రీవిష్ణు తనదైన నటనతో ప్రేక్షకులను అలరించారనీ , గత సినిమాలతో పోలిస్తే.. ఇందులో శ్రీవిష్ణు నటనలో పరిణితి కనిపించిందనీ . ఇక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా కేథరిన్ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసిందనీ సమాచారం.
జయమ్మ పంచాయితీ: వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో కొన్ని సంవత్సరాలుగా తన అద్భుతమైన యాంకరింగ్ తో ప్రేక్షకులను అలరిస్తున్న ప్రముఖ యాంకర్ సుమ ప్రధాన పాత్రలో తెరకెక్కిన విలేజ్ డ్రామా “జయమ్మ పంచాయితీ” మూవీ ఈ రోజు రిలీజ్ అయ్యింది. దేవి ప్రసాద్ , దినేష్ కుమార్ , షాలిని కొండేపూడి , గణేష్ యాదవ్ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు. జయమ్మ క్యారెక్టర్ లో సుమ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారనీ , దర్శకుడు విజయ్ “జయమ్మ పంచాయితీ “మూవీని అద్భుతంగా తెరకెక్కించారనీ . కీరవాణి తన సంగీతంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారనీ సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.