చాలా కాలంపాటు బుల్లితెరపై తన హవా చాటిన స్టార్ యాంకర్ సుమ ఇప్పుడు వెండి తెరపై మరోసారి ఎంట్రీ ఇస్తుంది. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో సుమ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా జయమ్మ పంచాయితీ. ఇక ఈసినిమా మే 6వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ ను జోరుగా చేస్తున్నారు. ఇక ఇప్పటికే సుమ జయమ్మ పంచాయితీ ప్రమోషన్స్ తో బిజీ బిజీగా గడిపేస్తుంది. అస్సలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈసినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూనే మరోపక్క సోషల్ మీడియాలో కూడా ఇంటర్వ్యూలు ఇచ్చేస్తుంది. ఇక దీనిలో భాగంగానే తాజాగా తెలుగు ఫిలింనగర్ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇవ్వగా అందులో ఎన్టీఆర్ తో ఎప్పుడు సినిమా చేస్తున్నారు అని అడుగగా దానికి సమాధానంగా సుమ ఎన్టీఆర్ తో పోటా పోటీగా డైలాగ్ ఉండే పాత్రలో చేస్తానని.. పంచ్ టు పంచ్ అలా ఉండాలని తెలిపింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
కాగా ఇటీవల ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ టైమ్ లో యాంకర్ సుమకు మీ సినిమాల్లో ఏదైనా క్యారెక్టర్ ఇవ్వాల్సి వస్తే ఎలాంటి పాత్రను ఇవ్వడానికి ఒప్పుకుంటారు అని కీరవాణి అడిగిన ప్రశ్నకు ఎన్టీఆర్ ..‘నాయనమ్మ, అమ్మమ్మలాంటి రోల్ ఇవ్వాలన్నారు. సుమను చూడగానే నిర్మలమ్మ, సూర్య కాంతం వంటి వాళ్లు పోషించిన గయ్యాలి పాత్రలు గుర్తుకు వస్తాయని.. సుమకు చాదస్తం ఎక్కువైందని, నోరేసుకుని పడిపోతుందని ఎన్టీఆర్ సుమ గురించి చెప్పారు. చూద్దాం మరి సుమ వెండితెరపైకి కూడా వచ్చేసింది కాబట్టి ఎన్టీఆర్ సినిమాలో సుమ కోసం ఎవరైనా స్పెషల్ గా క్యారెక్టర్ రాస్తారామో..
కాగా వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మిస్తున్న ఈసినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, అనూష్ కుమార్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: