లైగర్ క్రేజీ అప్ డేట్…!

Liger movie crazy Update,Liger Hunt Starts On Vijay Deverakonda’s Birthday,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Liger,Liger Movie,Liger Telugu Movie,Liger Movie latest Updates,Liger Movie latest News, Vijay Deverakonda Liger Movie Updates,Vijay Deverakonda Birthday, Happy Birthday Vijay Deverakonda,HBD Vijay Deverakonda,Liger Hunts Starts on Vijay Deverakonda Birthday,Vijay Deverakonda BIrthday on May 9th,9th May Hero Vijay Deverakonda Birthday, Makers of Liger Movie Shared a post in social media,Puri Jagannadh and Vijay Deverakonda Movie Liger,Vijay Deverakonda Upcoming Movies,Vijay Deverakonda Latest Movie Updates

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అలానే టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండకాంబినేషన్ లో వస్తున్న సినిమా లైగర్. ఈ సినిమాతో విజ‌య్ దేవ‌ర‌కొండ పాన్ ఇండియా హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుండటం.. అలానే క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ఆగష్ట్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా రిలీజ్ కు ఇంకా చాలా టైముంది. అందుకే చిత్రయూనిట్ కూడా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది కానీ ఈసినిమా ప్రమోషన్స్ పై ఇంకా ఫోకస్ పెట్టడంలేదు. ఆమధ్య వరుసగా ఒక రెండు మూడు అప్ డేట్స్ ఇచ్చి ఫ్యాన్స్ ను ఖుషీ చేశారు. కానీ ఈమధ్య ఒక్క అప్ డేట్ కూడా ఇవ్వడం లేదు మేకర్స్. మరోవైపు విజయ్ కూడా వేరే సినిమాల షూటింగ్ లలో కూడా పాల్గొంటున్నాడు.. పూరీ కూడా విజయ్ తో తను చేయబోయే రెండో సినిమా పనిలో పడిపోయాడు. దీంతో లైగర్ సినిమా నుండి అప్ డేట్ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ కూడా ఎదురుచూపులు చూస్తున్నారు. ఇక ఎలాగొలా నేడు తాజాగా ఈసినిమా నుండి ఒక అప్ డేట్ తో వచ్చేశారు. అతను హంగ్రీ, ఇండియా హంగ్రీ అంటూ మే 9 సాయంత్రం 4 గంటలకు అప్ డేట్ ఇవ్వనున్నట్టు తెలిపారు. అయితే అది ఏ అప్ డేట్ ఇస్తారన్న విషయంమాత్రం చెప్పలేదు.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా అనన్య పాండే నటిస్తుండగా. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించనున్నారు. రమ్యకృష్ణ తోపాటు బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × one =