సూపర్ స్టార్ రిలీజ్ చేసిన’జయమ్మ పంచాయితీ’ ట్రైలర్

Mahesh Babu Released Anchor Sumas Jayamma Panchayathi Movie Trailer,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Jayamma panchayathi,Jayamma panchayathi Movie,Jayamma panchayathi Telugu Movie,Jayamma panchayathi Movie Updates,Jayamma panchayathi Movie Trailer, Jayamma panchayathi Telugu Movie Trailer,Jayamma panchayathi Movie Official Trailer,Jayamma panchayathi Trailer Release Updates,Anchor Suma Jayamma panchayathi Trailer Releases, Mahesh Babu Launch Jayamma panchayathi Movie Trailer,Super Star Mahesh Babu Launch Jayamma panchayathi Movie Trailer,Jayamma Panchayathi Released By Super Star Mahesh Babu

విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో సుమ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా జయమ్మ పంచాయితీ. ఎన్నో ఏళ్లు బుల్లి తెరపై స్టార్ యాంకర్ గా తన హవా కొనసాగిస్తున్న సుమ ఇప్పుడు మరోసారి వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తుంది. ఈసినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల ఈనెల 6వ తేదీకి రిలీజ్ డేట్ ను మార్చారు. ఇక మరో రెండు రోజుల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో ఇంకా స్పీడు పెంచారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తనకు ఉన్న ఇమేజ్ ను ఈసినిమా కోసం సుమ బాగానే వాడుకుంటుంది అని చెప్పొచ్చు. అందుకే ఈసినిమా ప్రమోషన్స్ ను అసలు ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్టు దగ్గరుండి మరీ చూసుకుంటుంది. దీనిలో భాగంగానే ఈసినిమా ప్రమోషన్స్ కోసం పలు స్టార్ హీరోలు సైతం తమ చేయి వేశారు. దీంతో జయమ్మ పంచాయతీ మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయగా న్యాచురల్ స్టార్ నాని ఫస్ట్ సింగిల్, రానా దగ్గుబాటి ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేయగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక సూపర్ స్టార్ మహేష్ కూడా తన సపోర్ట్ అందించారు. ఈసినిమా నుండి మరో ట్రైలర్ ను మహేష్ చేతులు మీదుగా రిలీజ్ చేయించారు చిత్రయూనిట్.

కాగా వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మిస్తున్న ఈసినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, అనూష్ కుమార్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. మరి ఈసినిమా సుమ కు ఎలాంటి సక్సెస్ నుఅందిస్తుందో తెలియాలంటే మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + 14 =