టాలీవుడ్ లో ఇప్పుడు మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్స్ లో ఉప్పెన భామ కృతిశెట్టి కూాడా ఉంది. మొదటి సినిమా ఉప్పెన తోనే కృతి శెట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒక్క సినిమాతోనే టాలీవుడ్ మొత్తాన్ని తన మాయలో పడేసింది ఈభామ. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా కెరీర్ లో దూసుకుపోతుంది. ప్రస్తుతం రామ్ హీరోగా వస్తున్న ది వారియర్ అలానే ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి తో పాటు పలు తెలుగు సినిమాల్లో నటిస్తుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా కృతిశెట్టి అవకాశాలను దక్కించుకుంటూ కెరీర్ లో దూసుకుపోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఎన్ని సినిమాలు చేసినా ప్రతి హీరోయిన్ కు కొన్ని డ్రీమ్ రోల్స్ ఉంటాయి. అలాగే యంగ్ హీరోయిన్ కృతి శెట్టికి కూడా తన డ్రీమ్ రోల్ ఏంటో చెబుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి శెట్టి.. ఎప్పుడూ ఒకే తరహా పాత్రలు చేయడం అంటే నాకు ఇష్టం ఉండదు.. విభిన్న పాత్రలు చేయాలి.. అందుకే ప్రతి సినిమాకు డిఫరెన్స్ ఉండేలా చూసుకుంటున్నాను.. రొటీన్ గా ఉండే పాత్రలు వస్తే చేయను అనే చెప్పేస్తాను.. ఛాలెంజింగ్ పాత్రల్లో నటించాలనుంది అని తెలిపింది. అంతేకాదు.. అంతేకాదు, నాకు రాకుమారి పాత్రలో నటించాలనుంది. అది నా డ్రీమ్ రోల్.. ఎప్పటికి తీరుతుందో చూడాలి అంటూ తన కోరిక గురించి చెప్పుకొచ్చింది. మరి కృతి శెట్టి కోసం రాకుమారి పాత్ర ఏ డైరెక్టర్ రాస్తాడో.. ఆ అవకాశం కృతి శెట్టికి ఎప్పుడు వస్తుందో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: