నటించాల్సిన పాత్రలు చాలా ఉన్నాయి – తమన్నా

Tamannaah Bhatia Words About Her Wish In Film Industry,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Tamannaah,Actress Tamannaah,Tamannaah Movie Updats,Tamannaah Upcoming Movies,Tamannaah latest Movie Updates,Tamannaah in F3 Movie,Tamannaah in Bhola Shankar Movie, Tamannaah about Her Roles,Tamannaah About Her New Roles in movies,Tamannaah About Her Career in Movies,Tamannaah with Chiranjeevi in Bhola Shankar Movie, Star Heroine Tamannaah About her Roles in Movies,Tamannaah Bhatia About Her Wish

“శ్రీ ”(2005 ) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో సుమారు 16 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. అద్భుత డ్యాన్స్ టాలెంట్ ఉన్న తమన్నా పలు భాషల మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ తమన్నా ప్ర‌స్తుతం సత్యదేవ్ “గుర్తుందా శీతాకాలం “, వెంకటేష్ “F 3”, చిరంజీవి “భోళా శంకర్ ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. “బోలె చూడియా”, “ప్లాన్‌ ఎ ప్లాన్ బి”, ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ “బబ్లీ బౌన్సర్‌‌” , ఒక హిందీ వెబ్ సిరీస్ లో నటిస్తూ తమన్నా బాలీవుడ్‌లో బిజీగా మారుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ తమన్నా తన ఇమేజ్‌కి తగిన కథల్ని ఎంచుకుంటూ తన సీనియారిటీని కాపాడుకుంటున్నారు . ఒక ఇంటర్వ్యూ లో తమన్నా మాట్లాడుతూ .. సీనియారిటీ పెరిగింది అంటే.. బాధ్యత పెరిగినట్టే. వచ్చిన కొత్తలో.. నిలబడడం కోసం ఎలాంటి సినిమా అయినా ఒప్పుకొని ఉండొచ్చు. అందులో తప్పేమీ లేదనీ , కానీ ఓ పొజీషన్‌ వచ్చాక.. తప్పకుండా జాగ్రత్త పడాలనీ , చిత్ర సీమ లో చాలా ప్రయాణం ఉందనీ , చేయాల్సిన పాత్రలు చాలానే మిగిలి ఉన్నాయనీ , చిత్రసీమలో ఎప్పుడు ఎలాంటి అవకాశం తలుపు తడుతుందో చెప్పలేమనీ , తనను పూర్తిగా ఆవిష్కరించుకొనే పాత్ర అయితే ఇంకా రాలేదనీ , ఒకవేళ అలాంటి పాత్ర తాను చేసినా, మరో అద్భుతమైన పాత్ర కోసం ఎదురు చూస్తూనే ఉంటాననీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.