కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంట గా భారీ బడ్జెట్ తో రూపొందిన “ఆచార్య “మూవీ ఏప్రిల్ 29 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటించారు. సోనూసూద్ ఒక కీలక పాత్రలో నటించారు. “ఆచార్య ” మూవీ లో హీరోయిన్ రెజీనా ఫస్ట్ టైమ్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. “ఆచార్య” మూవీ లో టెంపుల్ టౌన్ సెట్ ప్రత్యేక ఆకర్షణ కానుంది.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“ఆచార్య “మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్ మీడియా తో సమావేశమయ్యి పలు విషయాలు ముచ్చటించారు. “ఆచార్య ” కథ అద్భుతమనీ , ఎవరితో తీసినా హిట్ అవుతుందనీ , నాన్న గారి , తన పాత్రలు డిఫరెంట్ గా ఉంటాయనీ , అంతిమంగా ధర్మం కోసమే నిలబడతాయనీ , చిరంజీవి తో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ చాలా కొత్తగా, గొప్పగా ఉందనీ ,ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న 20 రోజుల్లో ఎన్నో విషయాలు నేర్చుకున్నాననీ , సహ నటుడిగా ఆయన తనకు ఇచ్చిన గౌరవం, స్పేస్ మర్చిపోలేననీ , సెట్లో రీ టేకులు తీసుకొన్నా ఓపిగ్గా ఉండేవారనీ , తనను తప్పులు చేయించి, అందులోంచి పాఠాలు నేర్చుకునేలా చేశారనీ , ఆ సమయంలో నిజంగానే ఆయన ఓ ‘ఆచార్య’లా కనిపించారనీ , పూజాహెగ్డే అద్భుతంగా నటించారనీ , మా ఇద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరిస్తుందనీ , “ఆర్ ఆర్ ఆర్ “, “ఆచార్య ” మూవీస్ లోని పాత్రలు తనకు బాగా నచ్చాయనీ , రెండు డిఫరెంట్ పాత్రలలో నటించడం కష్టంగానే ఉన్నా ఇష్టంగానే అనిపించాయనీ చెప్పారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: