‘ఆచార్య’ లో కాజల్.. కొరటాల క్లారిటీ..!

Koratla Siva Gives Clarity about Kajal Role In Acharya,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Koratla Siva,Director Koratla Siva,Koratla Siva About kajal,Koratla Siva About kajal In Acharya Movie,Kajal In Acharya Movie with Chiranjeevi, Koratla Siva Gives Clarity about Kajal,Koratla Siva About Actress kajal,Chiranjeevi Acharya Movie,Koratla Siva Multi Starrer Movie Acharya,Kajal Role is Removed From Acharya, Koratla Siva Gives Clarity on kajal Role,Acharya Telugu Movie Review,Acharya Movie Review,Acharya Review,Acharya Movie Review and Rating,Acharya Movie Pre Review, Acharya First Review,Acharya,Acharya Movie,Acharya Telugu Movie,Acharya (2022 film),Acharya (2022),Acharya Movie (2022),Acharya Film,Acharya FDFS Review,Acharya Pre Review, Acharya Premiere Show Review,Acharya Movie Plus Points,Acharya Movie Highlights,Acharya Movie Updates,Acharya Pre Public Talk,Acharya Movie Live Updates,Acharya Movie Stroy, Acharya Movie Public Talk,Acharya Movie Public Response,Acharya Movie Public Talk And Public Response,Chiranjeevi And Ram Charan Multistarrer Movie,Acharya Movie Latest News, Megastar Chiranjeevi,Chiranjeevi,Ram Charan,Chiranjeevi Acharya,Koratala Siva,Kajal Aggarwal,Pooja Hegde,Acharya Movie Rating

తెలుగు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఆచార్య కూడా ఒకటి. మెగాస్టార్ చిరంజీవి అలానే తనయుడు రామ్ చరణ్ ను ఒకే స్క్రీన్ పై చూడాలని ఎదురుచూస్తుండగా.. ఈసినిమాతో అది నెరవేరుతుండటంతో ఆచార్య కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరోవైపు వరుస హిట్స్ తో మంచి ఫామ్ లో కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా కాబట్టి సినిమాపై మొదటినుండే మంచి అంచనాలు ఉన్నాయి. ఈనేపథ్యంలో ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, టీజర్, ట్రైలర్ అందర్నీ ఆకట్టుకోవడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇక్కడి వరకూ బాగానే ఉన్నా ఇప్పుడు ఈసినిమాలో కాజల్ ఉందా?లేదా? అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఈసినిమా ప్రమోషన్స్ ను మొదటుపెట్టిన కొత్తలో కాజల్ కు సంబంధించిన లాహే పాటను ఒకటి రిలీజ్ చేశారు. ఆ తరువాత కాజల్ కు సంబంధించిన అప్ డేట్స్ ఏం లేవు. ఇక తాాజాగా రిలీజ్ చేసిన ఈసినిమా ట్రైలర్ లో కూడా కాజల్ కనిపించింది. దీనివల్ల కాజల్ పాత్రపై అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. దీంతో ఇప్పుడు ఈ వార్తలకు కొరటాల శివ క్లారిటీ ఇచ్చాడు. ఈసినిమా నుండి కాజల్ పాత్రను తొలగించినట్టు చెప్పారు. సినిమా మొదలు పెట్టినప్పుడు హీరోకి తోడుగా హీరోయిన్ ఉంటే బావుంటుందని.. అప్పుడు సినిమాకు తగ్గట్టు ధర్మస్థలి అమ్మాయిగా కాజల్ పాత్రను క్రియేట్ చేశాం. ఆచార్య పాత్రకు లవ్ స్టోరీ పెడితే బావుంటుందా లేదా అన్న అనుమానం మొదట నాలో మొదలైంది.. నక్సలిజం, సిద్దాంతాలు నమ్మే వ్యక్తికి లవ్ స్టోరీ పెడితే బాగుండదని.. హీరోయిన్ కోసం ఏదో పాత్రను పెట్టాలని పెడితే ప్రేక్షకులకు కూడా నచ్చదు.. ఇదే విషయాన్ని చిరంజీవి గారితో అన్నాను.. ఆయన నీకు ఏది నచ్చితే అది చేయి అని అన్నారు.. ఆ తరువాత ఇదే విషయాన్ని కాజల్ కు కూడా చెప్పాను.. తను కూడా ఒప్పుకుంది.. ఫ్యూచర్ లో తప్పకుండా సినిమా చేద్దాం అని చెప్పింది అని కాజల్ పాత్రపై క్లారిటీ ఇచ్చాడు. మొత్తానికి ఇన్నిరోజులు కాజల్ పాత్రపై వస్తున్న వార్తలకు సమాధానం దొరికింది.

కాాగా ఈసినిమాలో చరణ్ సరసన పూజా హెగ్డే కనిపించనుంది. నిరంజన్ రెడ్డితో కలిసి రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను ఏప్రిల్ 29వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × three =