పోల్ గేమ్: సెన్సేషనల్ హిట్స్ లో ఏ మూవీ కి మీ ఓటు ?

Which latest sensational blockbuster impressed you the most,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Tollywood Movie,latest Sensational Movie,Latest Blockbuster Movies,Latest Sensational Movie Impressed You the Most,Akhanda Movie,Akhanda latest Blocbuster Movie,Allu Arjun Pushpa The Rise, Icon Star Allu Arjun Movie Pushpa the Rise,Nagarjuna Bangarraju Super Hit Movie,DJ Tillu Blockbuster Moive,Bheemla Nayak,Pawan kalyan Movie Bheemla Nayak,KGF2,Yash KGF Chapter 2 Movie,RRR,Jr NTR and Ram Charan Movie RRR, Rajamouli RRR Movie Updates

అఖండ : హీరో నందమూరి బాలకృష్ణ , దర్శకుడు బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ డిసెంబర్ 2వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను భారీ వసూళ్ళు సాధించింది. ప్రగ్య జైస్వాల్ కథానాయిక . థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండు పాత్రలలో పవర్ ఫుల్ డైలాగ్స్ , అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు.జనవరి 21న ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన “అఖండ ” మూవీ డిజిటల్ వేదికలోనూ రికార్డులను క్రియేట్ చేసింది. “అఖండ ” మూవీ 75 కోట్ల కు పైగా షేర్ సాధించి డిస్ట్రిబ్యూటర్స్ కు లాభాలను అందించింది. బాలకృష్ణ సినీ కెరీర్ లో “అఖండ“మూవీ అత్యధిక వసూళ్ళు సాధించిన మూవీ గా నిలిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పుష్ప:ది రైజ్: మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. “పుష్ప: ది రైజ్” మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. .“పుష్ప :ది రైజ్”మూవీ హిందీ వెర్షన్ 100కోట్ల క్లబ్ లో చేరింది.

బంగార్రాజు :జీ స్టూడియోస్ , అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్స్ పై కల్యాణ కృష్ణ కురసాల దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరో గా బ్లాక్ బస్టర్ “సోగ్గాడే చిన్నినాయనా “మూవీ సీక్వెల్ గా తెరకెక్కిన “బంగార్రాజు ” మూవీ జనవరి 14 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్అయ్యి ఘనవిజయం సాధించింది. నాగార్జున -రమ్యకృష్ణ, నాగచైతన్య – కృతిశెట్టి జంటలుగా నటించిన “బంగార్రాజు ” మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 3 రోజులలోనే 53 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.అనూప్ రూబెన్స్ స్వరపరచిన సాంగ్స్ ప్రేక్షకులను అలరించాయి.

డీజే టిల్లు: సితార ఎంటర్ టైన్ మెంట్స్ , ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్ధూ జొన్నలగడ్డ , నేహశెట్టి జంటగా తెరకెక్కిన “డీజే టిల్లు” మూవీ ఫిబ్రవరి 12వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో భారీ కలెక్షన్స్ వసూలు చేసింది.ఈ మూవీ లో సిద్దు అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఒక సెటిల్డ్ పెర్ఫామర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. మంచి బ్యూటిఫుల్ లుక్స్ తో కనిపించడమే కాకుండా తన గ్లామర్ తో కూడా నేహా శెట్టి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఓవర్ సీస్ లో, నైజాం లో మొదటి రోజే బ్రేక్ ఈవెన్ అయ్యి “డీజే టిల్లు”మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది.

భీమ్లా నాయక్ :సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో తెరకెక్కిన సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ “భీమ్లా నాయక్ ” మూవీ ఫిబ్రవరి 25 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడీ గా నిత్యామీనన్ , రానా కు జోడీ గా మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ నటించారు . థమన్ ఎస్ సంగీతం అందించారు. “భీమ్లా నాయక్” మూవీ లో తన పవర్ ఫుల్ డైలాగ్స్ , పెర్ఫార్మెన్స్ తో పవన్ కళ్యాణ్ ఆకట్టుకున్నారు. ఓవర్ సీస్ లో రెండు రోజులకు బ్రేక్ ఈవెన్ కు చేరుకొన్న “భీమ్లా నాయక్ ” మూవీ ప్రపంచవ్యాప్తంగా 3 రోజులలో భారీ కలెక్షన్స్ తో 100 కోట్ల క్లబ్ లో చేరి రికార్డ్ క్రియేట్ చేసింది.

ఆర్ ఆర్ ఆర్ :డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ విశేష ప్రేక్షకాదరణతో ప్రపంచవ్యాప్తంగా 1050 కోట్ల కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. బాలీవుడ్ లో భారీ కలెక్షన్స్ ను రాబడుతుంది.

కె జి ఎఫ్ చాప్టర్ 2: హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కె జి ఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతూ భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది.రవి బస్రూర్ సంగీతం అందించారు. “కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీ అన్ని భాషలలోను విశేష ప్రేక్షకాదరణ పొందుతుంది.ప్రపంచవ్యాప్తంగా 7 రోజులకు 700 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. “కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీ కర్ణాటక లో 100 కోట్ల క్లబ్ లో చేరింది. తెలుగు రాష్ట్రాలలో 100 కోట్ల క్లబ్ కు సమీపంలో ఉంది. ఇక బాలీవుడ్ లో 250 కోట్లకు పైగా , ఓవర్సీస్ లో 3 మిలియన్ డాలర్స్ కు పైగా వసూళ్ళతో దూసుకుపోతోంది.

పోల్ గేమ్: సెన్సేషనల్ హిట్స్ లో ఏ మూవీ కి మీ ఓటు ?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 2 =