దర్శకులు తాతినేని ప్రకాశరావు , కె . ప్రత్యగాత్మ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన తాతినేని రామారావు “నవరాత్రి”(1966) మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. “జీవన తరంగాలు”, “యమగోల ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన తాతినేని “యమగోల “హిందీ రీమేక్ గా తెరకెక్కిన “లోక్ పరలోక్ “మూవీ తో బాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. తెలుగు , హిందీ భాషలలో సుమారు 70 సినిమాలకు దర్శకత్వం వహించి పలు సూపర్ హిట్ మూవీస్ తో తెలుగు , హిందీ ప్రేక్షకులను అలరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరోలు నందమూరితారకరామారావు , అక్కినేని నాగేశ్వర రావు లతో పలు సూపర్ హిట్ మూవీస్ తెరకెక్కించిన ప్రముఖ సినీ దర్శకుడు తాతినేని రామారావు గతకొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. తాతినేని రామరావు మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: